Pawan Kalyan: OG షూట్ నుంచి పవన్ కళ్యాణ్.. అర్జున్ దాస్ ఫొటోలు వైరల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ OG షూటింగ్ స్పీడ్ అందుకుంది. విజయవాడ సమీపంలో వేసిన ప్రత్యేక సెట్‌లో ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో తమిళ్ స్టార్ అర్జున్ దాస్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా OG షూట్‌లో పాల్గొన్న అర్జున్ దాస్, పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు ఫ్యాన్స్ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్‌లో పవన్ స్టైలిష్ లుక్, అతని చిరునవ్వుతో ఫోటోలు ఫ్యాన్స్‌కి ఫుల్ జోష్ ని ఇస్తున్నాయి.

“మీతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. మీ బిజీ షెడ్యూల్‌ మధ్యలో కూడా మాతో కూర్చుని మాట్లాడినందుకు థ్యాంక్స్. మీతో గడిపిన ప్రతీ క్షణం గుర్తుండిపోతుంది. మళ్లీ కలిసిపనిచేయాలని ఆశిస్తున్నా” అంటూ అర్జున్ దాస్ భావోద్వేగంగా కామెంట్ చేశారు.

ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పవన్ OG గెటప్‌, తనలోని స్టైలిష్ షేడ్స్‌ను మరోసారి చూపిస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

మాగంటి ఆసుపత్రిలో చేరటం వెనుక అసలు కారణం ఇదేనా?

‘హరిహర వీరమల్లు’ మళ్లీ వాయిదా.. అధికారిక ప్రకటనతో ఫ్యాన్స్‌ నిరాశ

Leave a Reply