Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్లీ వాయిదా.. అధికారిక ప్రకటనతో ఫ్యాన్స్‌ నిరాశ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ మళ్లీ వాయిదా పడింది. ఈ సినిమా జూన్ 12న విడుదలవుతుందనుకున్నప్పటికీ, తాజా పరిస్థితుల్లో ఆ తేదీకి రిలీజ్ సాధ్యం కాకపోవడంతో చిత్ర బృందం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

“అచంచలమైన ఓపిక, నమ్మకంతో సినిమాపై ప్రేమ చూపిస్తున్న అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జూన్ 12న సినిమా విడుదల చేయాలని ప్రతి మినిట్ పని చేస్తున్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగిన విధంగా ప్రతి ఫ్రేమ్‌ని గౌరవంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కొంత సమయం తీసుకుంటున్నాం. అయితే ఈ సమయం తర్వాత ఒక అద్భుతమైన సినిమాను మీ ముందుకు తీసుకురాగలమనే నమ్మకం ఉంది.” అని పేర్కొన్నారు.

ఇకపై సినిమా గురించి వచ్చే పుకార్లను నమ్మొద్దని, అధికారిక సమాచారం మాత్రం తామే వెల్లడిస్తామని చిత్ర బృందం స్పష్టం చేసింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్‌కి సిద్ధమవుతున్నట్లు, కొత్త రిలీజ్ డేట్‌ను కూడా త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

ఈ చిత్రానికి ఎఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం అందిస్తున్నది ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం సమర్పణలో, ఎ. దయాకర్ రావు నిర్మాణం చేపట్టారు.

Leave a Reply