Arrest Kohli: కోహ్లీని వెంటనే అరెస్టు చేయాలి.. ఎక్స్‌లో ట్రెండింగ్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవ వేడుక సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్పందన తెచ్చింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, ఈ విషయంలో సోషల్‌మీడియాలో విరాట్ కోహ్లీపై ఆగ్రహం పెరుగుతోంది. ఎక్స్‌ (ట్విట్టర్) లో #ArrestKohli అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది.

కోహ్లీని అరెస్టు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన జరిగాక కోహ్లీ వెంటనే లండన్ వెళ్లిపోయాడని.. కనీసం మృతుల కుటుంబాలకు పరామర్శ కూడా తెలియజేయలేదని విమర్శిస్తున్నారు.

మ్యాచ్ గెలిచినప్పుడు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టిన కోహ్లీ, అభిమానుల మరణంపై మాత్రం స్పందించకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “కోహ్లీకి బాధ్యత ఉందని”, “విజయోత్సవ వేడుకకు ముఖ్య కారణం అతడని”, కొందరు నెటిజన్లు ఆగ్రహంగా పోస్టులు చేస్తున్నారు.

ఇటీవల కోహ్లీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ “జవాబుదారీగా ప్రవర్తించాలి” అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. వివాదం ఇంకా ముదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Leave a Reply