టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ పెళ్లి పీటలెక్కాడు. హీరో నాగార్జున రెండో కుమారుడైన అఖిల్, తన ప్రేయసి జైనబ్ రవ్జీతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసంలో బ్రహ్మముహూర్తంలో వీరి పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది.
@AlwaysRamCharan Spotted at #AkhilWedding pic.twitter.com/FhC06PWN5C
— Global Box Office (@GBOU_Offl) June 6, 2025
పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు దగ్గర స్నేహితులు, కొంతమంది సెలబ్రిటీ అతిథులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్-ఉపాసన జంట, దర్శకుడు ప్రశాంత్ నీల్ తదితరులు కొత్త దంపతులను ఆశీర్వదించారు. అనంతరం జరిగిన పెళ్లి బరాత్‌లో నాగార్జున, నాగచైతన్య సహా పలువురు కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేస్తూ హుషారుగా ఎంజాయ్ చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక జూన్ 8న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్‌ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సినీ రంగంతో పాటు రాజకీయ, పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
Megastar @KChiruTweets and Surekha Garu attended the wedding of @AkhilAkkineni8 and blessed the lovely couple on their special day.#AkhilWedding #AkhilAkkineni #Chiranjeevi pic.twitter.com/MMImsrc7yl
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 6, 2025
అఖిల్-జైనబ్‌ల నిశ్చితార్థం గతేడాది నవంబర్‌లో జరిగింది అన్న విషయం అందరికీ తెలిసిందే.