Broccoli: బ్రోకలీ తింటే ఎన్ని లాభాలో తెలుసా? తెలిసిన తర్వాత అస్సలు మానలేరు!

బ్రోకలీ చూడటానికి కాలిఫ్లవర్‌ను పోలి ఉంటుంది కానీ అందించే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అపారమైనవి. చెట్టు ఆకారంలో ఉండే ఈ ఆకుకూరలో ఎన్నో విలువైన పోషకాలు దాగి ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాల్లో బ్రోకలీ ముందు వరుసలో ఉంటుంది. ప్రతి రోజూ ఆహారంలో బ్రోకలీకి స్థానం ఇస్తే, ఎన్నో రకాల వ్యాధులను నివారించవచ్చు. వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులు సైతం దీన్ని తరచూ తీసుకోవాలని సూచిస్తున్నారు.

బ్రోకలీలో ఉండే కెరోటినాయిడ్స్ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చూపు మెరుగుపడేలా చేసి, కంటి సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలించడంలో సహకరించి, కణాలను బలోపేతం చేస్తాయి. క్యాన్సర్ కారకాలు ఏర్పడకుండా అడ్డుకుంటాయి.

విటమిన్ C అధికంగా ఉండే బ్రోకలీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధులు దూరంగా ఉంటాయి. ఇక విటమిన్ K గాయాల సమయంలో రక్తస్రావాన్ని నియంత్రిస్తుంది. రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. బ్రోకలీలో ఫోలేట్ (విటమిన్ B9) కూడా అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది.

ఇందులో ఉండే ఫైబర్, బరువు తగ్గడంలో సహకరించడమే కాకుండా, రక్తంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్రోకలీలో ఉండే పొటాషియం బీపీని సమతుల్యంగా ఉంచడమే కాకుండా, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.

బ్రోకలీలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచి రక్తహీనతను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతుంది. మెగ్నీషియం నాడీ వ్యవస్థకు అవసరమైన మద్దతును ఇస్తుంది.

అంతేకాదు, విటమిన్ E, విటమిన్ A, ఫాస్పరస్, బి6, జింక్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు బ్రోకలీలో దాగి ఉన్నాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు కలిగిన ఈ ఆకుకూర అంతర్గత వాపులను తగ్గించడంలో సైతం ఉపయోగపడుతుంది.

Leave a Reply