మన దేశంలో బంధాలు ఎంతో విలువైనవి. వాటిలో అన్న-తమ్ముడు బంధం ఓ ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. చిన్నతనంలో చేసుకున్న అల్లర్లు, పంచుకున్న నవ్వులు, తిట్లు, ఇవన్నీ మనం జీవితంలో మరిచిపోలేనివి. ఈ రోజు, బ్రదర్స్ డే సందర్భంగా అలాంటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడమే కాకుండా, మన బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే సమయం.
Brothers Day 2025 – ఎలా మొదలైంది?
మదర్స్ డే, ఫాదర్స్ డే, సిబ్లింగ్స్ డే లాగానే బ్రదర్స్ డే కూడా ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. అమెరికా అలబామాకు చెందిన సిరామిక్ కళాకారుడు, రచయిత సి. డేనియల్ రోడ్స్ 2005లో మొదటిసారి ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ తరవాత ప్రతి సంవత్సరం మే 24న బ్రదర్స్ డే జరుపుకోవడం ఒక ఆనవాయితీ అయింది. ఇప్పటికి ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. కొన్ని దేశాల్లో ఈ రోజున అధికారిక సెలవు కూడా ఇస్తున్నారు.
అన్న అంటే ఓ ఆధారం, తమ్ముడు అంటే ఓ బలం
అన్న అన్నవారికి నమ్మకమైన తోడు, బాధ్యతలు మోయగల పునాదిలా ఉంటారు. తమ్ముడు అనగానే కాస్త అల్లరి, కాని ప్రేమతో నిండిన వ్యక్తి గుర్తుకొస్తాడు. అమ్మాయిలకైతే బ్రదర్ అనేది సెక్యూరిటీ, పరిరక్షకుడు. ఇంట్లో వాళ్లు ఏడిపించినా, బయట వాళ్ల నుంచి కాపాడేవాడే అన్నా లేదా తమ్ముడు.
ఇప్పటికీ చాలామంది సోదరీమణులు బయటకి వెళ్లేటప్పుడు తమ్ముడిని వెంటబెట్టుకుంటారు. ఇదే బంధం.. ఇది రక్త సంబంధమే కాదు, ప్రేమతో పంచుకునే బంధం. పెళ్లైన తర్వాత సైతం అన్నా తమ్ముళ్లు తమ సోదరి కోసం ముందుండి నిలుస్తారు.
ఈ బంధాన్ని ఉజ్వలంగా నిలుపుదాం
ఇలాంటి రోజుల్లో రక్త సంబంధాలు సైతం కల్తీగా మారుతున్న తరుణంలో, మన మధ్య ఉన్న తమ్ముడు, అన్న బంధాన్ని నిలబెట్టుకోవడమే కాదు, భావితరాలకు కూడా అందించాల్సిన బాధ్యత మనదే. ఈ రోజు తమ్ముడికి, అన్నకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి, ప్రత్యేకంగా వంట చేసి, ప్రేమతో గడిపితే చాలు.. ఆ బంధం మరింత బలపడుతుంది.
ఈ రోజు స్పెషల్ మెసేజ్:
మీ తమ్ముడు లేదా అన్న కోసం ఈరోజు ఒక చిన్న మెసేజ్ పంపండి.. “నీకోసం నేను ఎప్పుడూ ఉన్నాను.. ఈ బంధం మనిద్దరినీ జీవితాంతం కలిపి ఉంచుతుంది.”