తెలుగు ప్రేక్షకులకు మాస్టర్ భరత్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్నప్పటి నుంచే Child Artist గా తనదైన నటనతో పలువురు అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా అతని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని అనారోగ్యంతో కన్నుమూశారు.
చెన్నైలో నివసిస్తున్న ఆమె, ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్తను తెలుసుకున్న సినీ వర్గాలు, అభిమానులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమలహాసిని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలు తెలియజేశారు. భరత్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని తెలిపారు.
మాస్టర్ భరత్ వెంకీ, ఢీ, రెడీ, కింగ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. పెద్దయ్యాక కూడా నటనను కొనసాగిస్తూ, ప్రస్తుతం సాగర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పుకున్న భరత్… “ఇప్పటికీ నేను అమ్మచాటు బిడ్డనే. అమ్మ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను” అని పేర్కొన్నాడు. తాను మెడిసిన్ పూర్తిచేసి డాక్టరేట్ చేస్తున్నట్లు చెప్పిన భరత్… తల్లిని కోల్పోవడం అతనికి తీరని లోటు అయింది.