భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. “శివయ్య అంటే శివుడు రాడు” అన్న డైలాగ్‌ను ఇమిటేట్ చేస్తూ, అతని అన్న మంచు విష్ణుపై మనోజ్ ఇండైరెక్ట్‌గా సెటైర్లు వేశారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు, ట్రైలర్ ఈవెంట్‌లో మనోజ్ భావోద్వేగంతో మాట్లాడిన సందర్భంలో వచ్చాయి.
విజయ్ కనకమేడల దర్శకత్వంలో, మనోజ్‌తో పాటు నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ భైరవం ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ ఈవెంట్‌లో మనోజ్ మాట్లాడుతూ
“తెరపైకి వచ్చి 9 ఏళ్లైంది. ఎన్నెన్నో పోరాటాల తర్వాత మళ్లీ మీ ముందుకొస్తున్నాను. డైరెక్టర్ విజయ్ కనకమేడలపై నాకు జీవితాంతం రుణం ఉంటుంది. ఈ 9 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలున్నాయి… కానీ మీ ప్రేమ ఎప్పుడూ నా తోడుగా ఉంది. ఈ రోజుల్లో సొంత వాళ్లు దూరం పెడితే, మీరు మాత్రం దగ్గర చేసుకున్నారు.” అని భావోద్వేగంగా స్పందించారు.
అన్న విష్ణుపై పరోక్ష సెటైర్లు?
ఈ ప్రసంగంలో మనోజ్ చేసిన వ్యాఖ్యల్లో.. “శివయ్య అంటే శివుడు రాడు. మనసారా కోరుకుంటే శివుడు ఎప్పటికైనా వస్తాడు. ప్రొడ్యూసర్ రూపంలోనైనా, డైరెక్టర్ రూపంలోనైనా, ఫ్యాన్స్ రూపంలోనైనా వస్తాడు.” అని అన్నారు. ఈ మాటలు మంచు విష్ణు నటించిన “కన్నప్ప” సినిమాలోని డైలాగ్‌ను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్రోల్ చేశారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో దీనిపై చర్చ జోరుగా సాగుతోంది.