ప్రపంచవ్యాప్తంగా ఆటో పరిశ్రమను వణికిస్తున్న శకం ఇది. నిస్సాన్ మోటార్ కంపెనీ ఒక్కసారిగా 20,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతుండటం ప్రస్తుతం సంచలనంగా మారింది. అమెరికా, చైనాల్లో విక్రయాలు క్షీణించడంతో కంపెనీ ఆదాయం 94 శాతం తగ్గిపోయింది. దీంతో మొత్తం ఉద్యోగులలో 15 శాతం మందిని తొలగించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Nissan Motor is set to cut an additional 10,000 jobs globally, bringing the total number of layoffs to around 20,000—about 15 percent of its entire workforce.@JyotsnaKumar13 reports pic.twitter.com/61pJGGuM31
— WION (@WIONews) May 13, 2025
కరోనా తర్వాత గ్లోబల్ మార్కెట్లలో ఉద్యోగ క్షీణత కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు లేఆఫ్స్ ఎక్కువగా ఐటీ రంగాన్ని టార్గెట్ చేసినప్పటికీ, ఇప్పుడు ఆటో పరిశ్రమలోనూ ఉద్యోగుల భద్రత ప్రమాదంలో పడుతోంది. మొదట 9 వేల మంది ఉద్యోగులను తొలగించాలని భావించిన నిస్సాన్, ఇప్పుడు దానికి మరో 11 వేల మందిని చేర్చి, మొత్తంగా 20 వేల మందికి పింక్ స్లిప్ ఇవ్వబోతోంది.
AUTO GIANT NISSAN TO NOW LAYOFF 20,000 EMPLOYEES TO LOWER COSTS AS SALES COLLAPSE IN CHINA & AMERICA pic.twitter.com/TPfWEUNbhW
— GURGAVIN (@gurgavin) May 12, 2025
అమెరికా, చైనా మార్కెట్లలో విక్రయాలు తీవ్రంగా పడిపోవడం, నిరంతరం తగ్గుతున్న డిమాండ్, కంపెనీ ఖర్చుల పెరుగుదల వంటి కారణాలే ఈ నిర్ణయానికి దారితీశాయని తెలుస్తోంది. అయితే కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.