న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ “హిట్: ది థర్డ్ కేసు” మేడే సందర్భంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. నాని ఈసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో మాస్ యాంగిల్‌తో అలరించగా, ప్రేక్షకులు మరియు విమర్శకులు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఫస్ట్ డే వసూళ్ల వివరాలు:
చిత్రయూనిట్ ప్రకటించిన ప్రకారం, “హిట్ 3” సినిమా మొదటి రోజే రూ.43 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఇది నాని కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమా కావడం గమనార్హం. ప్రత్యేకంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ మూవీ భారీ హైప్‌తో వన్ మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది. వీకెండ్ ముగిసేలోగా రెండు మిలియన్ డాలర్ల క్లబ్ చేరే అవకాశముంది.
SARKAAR’S BOX OFFICE MAYHEM collects a whopping 43+ CRORES GROSS WORLDWIDE on DAY 1 💥💥
Natural Star @NameisNani‘s HIGHEST DAY 1 GROSSER 🔥#HIT3 is the #1 INDIAN FILM WORLDWIDE YESTERDAY ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/T7DiAui6Pa#BoxOfficeKaSarkaar… pic.twitter.com/5r8Ow5WhyL— Unanimous Productions (@UnanimousProds) May 2, 2025
రికార్డుల వర్షం:
ఆన్‌లైన్ టికెట్ ప్లాట్‌ఫామ్ “బుక్ మై షో” లో 24 గంటల్లో 2.72 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.
నాని కెరీర్‌లో ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో టికెట్లు అమ్ముడవడం ఇదే తొలిసారి.
ప్రీ-బుకింగ్స్ నుంచే జోష్ చూపించిన సినిమా విడుదల తర్వాత కూడా అదే స్పీడ్‌తో దూసుకుపోతోంది.
కథానాయికగా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటించింది. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ఈ సినిమాతో నాని మరోసారి మాస్ మార్కెట్‌లో తన సత్తా చాటినట్టు కనిపిస్తోంది.