AP: ఏపీ సర్కార్ నుంచి మత్స్యకారులకు భారీ గిఫ్ట్.. ఇవాళే అకౌంట్లోకి రూ.20,000

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల కోసం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “మత్స్యకార సేవలో” పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నారు.

ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధం కొనసాగుతుంది. ఈ 61 రోజుల కాలంలో మత్స్యకారులు తమ సంపాదనను కోల్పోతారు. వారి జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం ఈ ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభం

పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు ప్రతిష్టాత్మకంగా రూ.20,000 చెక్కులను అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో కుటుంబానికి రూ.10,000 మాత్రమే అందించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ మొత్తం రెట్టింపు చేసి రూ.20,000గా పెంచింది.

1.29 లక్షల కుటుంబాలకు లబ్ధి

“మత్స్యకార సేవలో” పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.258 కోట్లను మంజూరు చేసింది. ఈ కొత్త పథకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు గట్టి మద్దతు లభించనుంది.

Leave a Reply