అఘోరీకి చెవెళ్ల కోర్టు షాక్.. సంగారెడ్డి జైల్లో 14 రోజులు రిమాండ్

చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌కు చెవెళ్ల కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణ అనంతరం కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలు (కంది జైలు)కి తరలించారు. అదే సమయంలో బాధితురాలు వర్షిణీని భద్రతల దృష్ట్యా భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ ఆమెకు కౌన్సిలింగ్ అందించనున్నారు.

అఘోరీ అరెస్ట్ ఎలా జరిగింది?
ఒక మహిళా ప్రొడ్యూసర్‌కు పూజల పేరుతో మాయ మాటలు చెప్పి లక్షలాది రూపాయలు కాజేసిన కేసులో అఘోరీ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ఉ-త్తరప్రదేశ్ సరిహద్దు వద్ద ఆమెను పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్‌కు, అక్కడినుంచి చెవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు.

కోర్టు ఆదేశాలు & లాయర్ వాదనలు
కేసులో అఘోరీ తరఫు లాయర్ మాట్లాడుతూ, “ఇంతవరకూ కోర్టులో వాదోపవాదనలు ఏమీ జరగలేదు. కేవలం 14 రోజుల రిమాండ్ మాత్రమే విధించారు. కేసుకు సంబంధించి అన్ని పూర్వాపరాలు పరిశీలించాల్సి ఉంది. బెయిల్ విషయమై ఈ దశలో ఏమీ చెప్పలేం” అని తెలిపారు.

ఏం జరిగింది? కేసు వివరాలు ఇవే:
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలానికి చెందిన ఓ మహిళా ప్రొడ్యూసర్, గతంలో ప్రగతి రిసార్ట్స్‌లో జరిగిన డిన్నర్ సందర్భంగా ఈ అఘోరీతో పరిచయం అయ్యారు. ఆపై తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిన అఘోరీ, పూజ చేస్తే అభ్యుదయం వస్తుందని నమ్మబలికింది.

తొలుత రూ.5 లక్షలు తన అకౌంట్‌లో వేయించుకుంది .. తర్వాత ఉజ్జయినిలో ఫాం హౌస్‌కు తీసుకెళ్లి పూజలు జరిపింది.. మరోసారి రూ.5 లక్షలు డిమాండ్ చేస్తూ, “పూజ విఫలమైతే కుటుంబం నాశనం అవుతుంది” అని బెదిరించింది.. భయంతో బాధితురాలు మరో రూ.5 లక్షలు చెల్లించింది

ఇప్పుడు కేసు మలుపులు తిరుగుతోంది..
ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అఘోరీ చేతిలో మోసపోయిన వేరే బాధితులు కూడా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు, బాధితురాలైన వర్షిణీకి మానసికంగా వత్తిడి తేలిక చేయడానికే కౌన్సిలింగ్ అందిస్తున్నారు.

Leave a Reply