జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, “దీనికి బాధ్యులైన వారిని వదలమని, న్యాయం తప్పనిసరిగా జరుగుతుందని” స్పష్టం చేశారు.
అమిత్ షా ప్రకటనలో హైలైట్స్:
“పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారిని చూసి ప్రతి భారతీయుడి గుండె తడిసి ముద్దవుతోంది. అమాయకుల రక్తం వృథా కాకుండా చూస్తాం. దేశ ప్రజలతో ఒక హామీ.. ఈ దుర్మార్గులను శిక్షిస్తాం.”
దాడి జరిగిన బైసరాన్ ప్రాంతాన్ని అమిత్ షా స్వయంగా పరిశీలించారు. ఈ దాడిలో గాయపడిన వారికి పరామర్శనలిస్తూ, మరణించిన వారి కుటుంబ సభ్యులను కూడా కలిశారు. బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
पहलगाम के आतंकी हमले में अपनों को खोने का दर्द हर भारतीय को है। इस दुःख को शब्दों में व्यक्त नहीं किया जा सकता।
मैं अपने इन सभी परिवारों और पूरे देश को विश्वास दिलाता हूँ कि बेगुनाह मासूम लोगों को मारने वाले इन आतंकियों को बिल्कुल बख्शा नहीं जाएगा। pic.twitter.com/Dwkt6Hhj7P
— Amit Shah (@AmitShah) April 23, 2025
ఉగ్రవాదంపై మరోసారి ‘స్ట్రాంగ్ రస్పాన్స్’:
ఈ దాడిపై బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యవసర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ సలహాదారుడు అజిత్ దోవల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఉగ్రస్థావరాలపై మరోసారి సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించిన చర్చలు జరగనున్నట్లు సమాచారం.
ప్రభుత్వ సాయం కూడా ప్రకటించారు:
ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా సహాయం ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.1 లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఈ దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఉగ్రవాదానికి తగిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.