Upma: ఉప్మా అని తీసిపారేయకండి బ్రో.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రోజూ అదే టిఫిన్‌..!

ఉప్మా పేరు వినగానే కొంతమందికి చిరాకు, ఇంకొంతమందికి వాంతులే వచ్చేస్తుంటాయి. కానీ అదే ఉప్మా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే సూపర్ ఫుడ్ అని మీకు తెలుసా? డాక్టర్లు, పోషకాహార నిపుణులు కూడా ఉప్మా తినాలని సూచిస్తారు. ఇది కేవలం తక్కువ కేలరీల టిఫిన్‌ మాత్రమే కాదు, జీర్ణ సమస్యల నుంచి రోగనిరోధక శక్తి పెంచేదాకా ఎన్నో లాభాలు కలిగి ఉంటుంది.

జీర్ణ సమస్యలకు చెక్
ఉప్మాలో ఉండే న్యూట్రియంట్లు జీర్ణ ప్రక్రియను సాఫీగా సాగించేలా చేస్తాయి. పచ్చి కూరగాయలతో కలిసి వండితే కడుపులో మంట, అజీర్ణం, గ్యాస్ లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

మలబద్ధకం కంట్రోల్
ఈ రోజుల్లో ఏ జీవనశైలి చూసినా.. ఫాస్ట్ ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడం వలన మలబద్ధకం కామన్ సమస్య. కానీ ఉప్మాలో ఉండే ఫైబర్ శాతం దీన్ని చాలా వరకు తగ్గించగలదు. రోజుకు ఒకసారి ఉప్మా తీసుకుంటే మలబద్ధకం కంట్రోల్‌లో ఉండే అవకాశముంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఉప్మాలో పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ వంటి కూరగాయలు వేయడం వల్ల విటమిన్లు, ఖనిజాలు అధికంగా అందుతాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరిగి, సీజనల్ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గాలనుకునేవారికి
కేలరీలు తక్కువగా ఉండే ఉప్మా.. భోజనానికి తక్కువ టైమ్ ఉండే వారికి బెస్ట్ చాయిస్. ఇది త్వరగా నిండిపోతుంది కానీ శరీరానికి బరువు కాకుండా ఉంటుంది. అందుకే బరువు తగ్గే డైట్‌లో ఉప్మా ఒక మార్నింగ్ లేదా ఈవెనింగ్ ఎంపికగా చాలా మందికి నచ్చుతుంది.

డబ్బు, టైమ్ రెండూ ఆదా
పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న పదార్థాలతో తక్కువ సమయంలో తయారవుతుంది. వంట చేసేవారికి ఇది బిగ్ రిలీఫ్. ఒకే బుర్రలో టేస్ట్, హెల్త్, టైమ్ సేవ్ అన్నీ కావాలంటే ఉప్మా ఒక మంచి ఆప్షన్!

మొత్తానికి..
ఉప్మా నచ్చకపోయినా, దీని లాభాలు చూస్తే అది మీ రోజువారీ టిఫిన్‌ ప్లేట్‌లో తప్పనిసరి అయిపోతుంది. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఉప్మాను నిర్లక్ష్యం చేయొద్దు బ్రో!

Leave a Reply