Sweet Pongal Recipe: ఇంట్లో ఈజీగా.. చక్కర పొంగలి ఇలా తయారుచేయండి..!

చక్కర పొంగలి అనగానే మనకు శుభ సందర్భాలు, పండుగలు గుర్తొస్తాయి కదా! ఈ మధురమైన రుచి మన హృదయాలకే కాదు, హోం కిచెన్‌లకు కూడా స్పెషల్ ఫీల్ తీసుకురావడమే. ఇంట్లోనే సింపుల్‌గా, టేస్టీగా ఈ చక్కర పొంగలి ఎలా తయారుచేయాలో చూద్దాం!

అవసరమైన పదార్థాలు:
బియ్యం – 1 కప్పు

పెసరపప్పు – ¼ కప్పు

బెల్లం – 1 కప్పు (తురిమినది)

నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు

యాలకుల పొడి – ¼ స్పూన్

జీడి పప్పు – 8-10

ద్రాక్ష (కిస్మిస్) – 10

నీరు – 4 కప్పులు

పాలు – 1 కప్పు (ఐచ్ఛికం)

తయారీ విధానం ఇలా:
ముందుగా బియ్యం, పెసరపప్పును శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో వేసి 4 కప్పుల నీటితో ఉడికించండి. (పాలు కలిపితే పొంగలి మరింత రిచ్‌గా ఉంటుంది!)

ఇప్పుడు చిన్న పాన్ తీసుకుని, తురిమిన బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి మెల్లగా వేడి చేయండి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దాన్ని వడకట్టి పక్కన పెట్టేయండి.

కుక్కర్‌లో బాగా ఉడికిన బియ్యం-పప్పు మిశ్రమంలో, ఇప్పుడు ఆ బెల్లం పాకాన్ని వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని మళ్ళీ 5-10 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించండి.

తర్వాత అందులో యాలకుల పొడి జోడించండి.. ఇది అసలైన ఫ్లేవర్ టర్నింగ్ పాయింట్!

ఇక చివరగా, చిన్న పాన్‌లో నెయ్యి వేడి చేసి జీడి పప్పు, ద్రాక్ష వేసి బంగారు రంగులో తాళించి పొంగలిలో కలపండి.

ఇప్పుడు వేడి వేడి చక్కర పొంగలి రెడీ!
ఈ స్వీట్‌ను ఒక్కసారి రుచి చూసిన తర్వాత మళ్లీ మరిచిపోలేరు. శ్రీవారి నైవేద్యంగా, లేదా పండగ రోజుల్లో స్పెషల్ ఐటెంగా… ఈ చక్కర పొంగలి మీ ఇంట్లోనూ మెయిన్ పుడ్ గా నిలుస్తుంది!

Leave a Reply