తమన్నా కీలక పాత్రలో నటించిన ‘ఓదెల 2’ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2022లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు ఇది సీక్వెల్. హర్రర్, మిస్టరీ, థ్రిల్ అంశాలతో ట్రైలర్‌ను అశోక్ తేజ చాలా ఉత్కంఠగా కట్ చేశారు. ఇందులోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గ్రామీణ హారర్ నేపధ్యం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
ట్రైలర్ చూస్తే.. ఓ గ్రామంలో అసాధారణ సంఘటనలు, ప్రేతాత్మల అనుభూతులు, అసలు ఎవరు నిజంగా జీవితం మీద అధికారాన్ని కలిగి ఉన్నారన్న ప్రశ్నలు కలగొచ్చేలా ఉన్నాయి. తమన్నా ఇందులో శక్తివంతమైన రోల్‌లో కనిపిస్తుంది. ఆమె క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది.
The epic battle between the divine and the devil begins 💥
Witness the mighty power of the SHIVA SHAKTI 🔱❤🔥#Odela2Trailer out now!
▶️ https://t.co/nzhvk3SH5H #Odela2 GRAND WORLDWIDE RELEASE ON APRIL 17th.#Odela2onApril17 @tamannaahspeaks @ashokalle2020 @ihebahp… pic.twitter.com/TIgL1Hh0vd— Sampath Nandi (@IamSampathNandi) April 8, 2025
ఈ సినిమాలో తమన్నా తో పాటు హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, మిస్టీరియస్ అట్మాస్‌ఫియర్ ఈ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి.
‘ఓదెల 2’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానుంది. హర్రర్ జానర్ అభిమానులకు ఇది థియేటర్‌లో వణుకు పుట్టించే అనుభూతి అందించబోతోంది. మీరూ ఈ ట్రైలర్‌ని ఒకసారి తప్పకుండా చూసేయండి – డిఫరెంట్ ఫీల్ గ్యారెంటీ!