తమిళ నటి శృతి నారాయణ్ ప్రైవేట్ వీడియో నెట్టింట వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వీడియో నిజమైనది కాదని, అది AI సాయంతో సృష్టించిన ఫేక్ కంటెంట్ అని శృతి తాజాగా వివరణ ఇచ్చింది. ఇలాంటి వీడియోలు కొందరికి వినోదంగా అనిపించవచ్చు కానీ బాధితులకు తీవ్ర మనోవేదన కలిగిస్తాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తమిళ నటి శృతి నారాయణ్ పై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ప్రైవేట్ వీడియో అసలు నిజం కాదని తెలుస్తోంది. AI టెక్నాలజీ ద్వారా మోసగాళ్లు ఈ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి పలు వెబ్‌సైట్‌లలో షేర్ చేయడం వల్ల నెట్టింట్లో పెను సంచలనం రేపుతోంది. ఈ పరిణామంపై శృతి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
🙏🏻🙏🏻 #ShruthiNarayanan #ShruthiNarayananleaked pic.twitter.com/tRpGbQ0bsA
— Shruthi Narayanan (@iamShruthi_offc) March 28, 2025
దీనిపై శృతి స్వయంగా స్పందిస్తూ, “ఇలాంటి AI వీడియోలను షేర్ చేయడం కొంతమందికి సరదాగా అనిపించవచ్చు, కానీ బాధితునికి ఇది చాలా పెద్ద మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది” అని చెప్పింది. ఆమె తన సోషల్ మీడియా ద్వారా తన బాధను వ్యక్తం చేస్తూ, “నా గురించి వైరల్ అవుతున్న వీడియోలు చూసి మీకు సరదాగా అనిపించవచ్చు, కానీ నాకు, నా కుటుంబానికి, నా స్నేహితులకు ఇది చాలా బాధాకరం. నేను కూడా ఒక అమ్మాయినే, నాకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. మీరు ఇంతలా దిగజారాలా? దయచేసి ఈ వీడియోను షేర్ చేయడం ఆపండి. మీకు నిజంగా ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే.. మీ చెల్లెలు లేదా మీ ప్రేయసి వీడియో చూసుకోండి. వాళ్లకు కూడా నాలాంటి శరీరమే ఉంటుంది. వారిదే చూడండి” అంటూ తన ఆవేదనను వెల్లగక్కింది.
24 ఏళ్ల చెన్నైకి చెందిన శృతి నారాయణన్ ప్రస్తుతం తమిళ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తమిళ సీరియల్ సిరగడిక్క ఆసై లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. 649 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇందులో అనిల్ శ్రీకుమార్, శ్రీ దేవా, ఆర్. సుందరరాజన్ వంటి ప్రముఖ నటులతో కలిసి శృతి సహాయ పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది.