బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మలైకా అరోరా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం, ఫిట్‌నెస్, ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్‌తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే, తాజాగా ఆమె స్టేడియంలో కనిపించిన ఓ సంఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆదివారం గౌహతిలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా, మలైకా రాజస్థాన్ జట్టును ఉత్సాహపరుస్తూ కనిపించింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే, ఆమె శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ కుమార సంగక్కర పక్కన కూర్చొని మ్యాచ్‌ను వీక్షించడం.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, ఫ్యాన్స్ నానా హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతం మలైకా, అర్జున్ కపూర్ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం కొనసాగుతుండగా, సంగక్కరతో ఆమె కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ‘అర్జున్ కపూర్‌ను వదిలేసి సంగక్కరతో కొత్త రిలేషన్ షురూ చేసిందా?’ అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.
సంగక్కర, మలైకా మధ్య వాస్తవంగా ఏమైనా ఉందా? లేక ఇది కేవలం ఓ రూమర్ మాత్రమేనా? అనే దానిపై స్పష్టత లేదు. అయితే క్రికెట్ ఫ్యాన్స్, బాలీవుడ్ అభిమానులు మాత్రం ఊహాగానాలకు తగ్గదలచుకోవడం లేదు. సోషల్ మీడియాలో ‘సంగక్కర, మలైకా కొత్త జంటనా?’ అనే హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఆమె బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుని 2017లో విడాకులు తీసుకున్నారు. వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. విడాకుల తర్వాత, మలైకా అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో తరచూ వీరి ఫొటోలు వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇప్పుడు సంగక్కరతో ఆమె కలిసి కనిపించడం, క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనడం వెనుక అసలు కారణం ఏమిటి? వీరిద్దరి మధ్య ఏదైనా ప్రత్యేకమైన బంధం ఉందా? లేక ఇది కేవలం ప్రొఫెషనల్ మీటింగ్ మాత్రమేనా? అనే ప్రశ్నలు ఇప్పటికి స్ఫష్టత లేకుండా ఉన్నాయి.
శ్రీలంక క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరొందిన కుమార సంగక్కర, క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత కూడా పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. క్రికెట్‌కు సంబంధించి విశ్లేషణలు, కామెంటరీలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు.
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నా, ఇప్పటి వరకు మలైకా అరోరా గానీ, కుమార సంగక్కర గానీ ఈ విషయం గురించి అధికారికంగా స్పందించలేదు. అయితే వీరి ఫోటోలు వైరల్ కావడం వల్ల, త్వరలోనే ఈ వివాదంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.