Ugadi Movies: ఉగాది మూవీ ఫెస్ట్: బాక్సాఫీస్ పై ఏ హీరో విజయం సాధించబోతున్నాడు?

ఈ వారాంతం ఉగాది, రంజాన్ పండుగల సంబరాలతో పాటు బాక్సాఫీస్‌పై భారీ సినిమాల హంగామా నెలకొంది. లాంగ్ వీకెండ్‌ను వినోదంగా మార్చేందుకు నాలుగు క్రేజీ సినిమాలు పోటీకి దిగాయి. మోహన్ లాల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘L2: Empuraan’, నితిన్ యాక్షన్ థ్రిల్లర్ “రాబిన్ హుడ్”, క్రేజీ కామెడీ ‘మ్యాడ్ స్క్వేర్’, బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ “సికందర్” వరుసగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. ఈ నాలుగు చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఉత్కంఠగా మారింది.

మార్చి 28 న నితిన్ ‘రాబిన్ హుడ్’ మరియు ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘రాబిన్ హుడ్’ ప్రమోషనల్ కంటెంట్‌కు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ ప్రత్యేక రోల్ చేయడంతో హైప్ మరింత పెరిగింది. ‘మ్యాడ్ స్క్వేర్’ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమైంది. USAలో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ సృష్టిస్తున్నాయి. పార్ట్ 1 హిట్ కావడంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించిన బాలీవుడ్ బిగ్ మూవీ ‘సికందర్’ మార్చి 30న విడుదల కానుంది. నార్త్ బెల్ట్‌లో భారీగా ఈ మూవీ ప్రభావం చూపే అవకాశం ఉంది. యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో సల్మాన్ ఖాన్ మరో మాస్ బ్లాక్‌బస్టర్ అందిస్తాడా అనే ఆసక్తి నెలకొంది.

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘L2: Empuraan’ మార్చి 27న గ్రాండ్‌గా విడుదలైంది. మలయాళ బిగ్గెస్ట్ ఫ్రాంచైజీగా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ఇండియా, USAలో హౌస్‌ఫుల్ షోస్‌తో అదరగొడుతోంది.

మరి ఈ నాలుగు సినిమాలలో వీకెండ్ బాక్సాఫీస్ రేసులో ఎవరు హిట్ కొడతారో చూడాలి!

Leave a Reply