టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓటీటీ వేదికపై తన హవాను కొనసాగిస్తూ మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్: హానీ-బన్నీ’ సిరీస్‌లోని అద్భుతమైన నటనకు గుర్తింపుగా, ఓ ప్రముఖ మీడియా సంస్థ “ఓటీటీ ఉత్తమ నటి” అవార్డును సమంతకు ప్రదానం చేసింది.
రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో సమంత వరుణ్ ధావన్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్ మిలియన్ల వ్యూస్‌ను రాబట్టింది. సమంత స్టంట్స్‌తో కూడిన యాక్షన్ సీన్లు, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా తెరకు కొంతకాలంగా దూరంగా ఉన్నప్పటికీ, ఓటీటీలో సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ అవార్డు స్పష్టంగా తెలియజేస్తోంది.
ఈ అవార్డును అందుకున్న అనంతరం సమంత తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ఈ సిరీస్ పూర్తిచేయడమే నాకు నిజమైన అవార్డు. అనేక ఆరోగ్యపరమైన సవాళ్లు ఎదురైనా, నా పాత్రకు న్యాయం చేసేందుకు ఎంతో కష్టపడ్డాను. నన్ను నమ్మిన అభిమానులకు, దర్శకులు రాజ్ అండ్ డీకేకు, నా సహనటుడు వరుణ్ ధావన్‌కు కృతజ్ఞతలు. వాళ్లంతా నా ప్రయాణంలో నాకు అండగా నిలిచారు.” అంటూ భావోద్వేగంగా స్పందించింది.
Inspiring & igniting
Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/AADTnHpXAA— Samcults (@Samcults) March 21, 2025
అవార్డు కార్యక్రమంలో సమంత తన స్టన్నింగ్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ డిజైనర్ క్రేషా బజాజ్ డిజైన్ చేసిన లావెండర్ శారీలో గ్రేస్‌ఫుల్‌గా మెరిసిపోయింది. సాంప్రదాయ శైలికి మోడ్రన్ టచ్ జోడించి మరోసారి ఫ్యాషన్ ఐకాన్ అనే మాటను నిరూపించుకుంది. స్మోకీ ఐస్, పింక్ లిప్‌స్టిక్, మెరిసే హైలైటర్ తో మరింత అందంగా కనిపించిన ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమంత స్టన్నింగ్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సమంత కెరీర్లో ఇది మరో మైలురాయి అని చెప్పొచ్చు. ఓటీటీ నుంచి తెరపైకి తిరిగి ఎప్పుడు వస్తుందనేదే అభిమానుల ఎదురుచూపు. ‘సిటాడెల్’ విజయం తరువాత, సమంత తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరి, త్వరలోనే బిగ్ స్క్రీన్‌పై తిరిగి మెరవబోతుందా? అనేది చూడాలి!