Sapota: ఈ పండు రోజుకు 2 తింటే మీ లివర్‌ క్లీన్‌.. చెడు కొలెస్ట్రాల్‌కి చెక్.. జీర్ణశక్తి పెరుగుతుంది

మన ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే వైద్యులు సరైన ఆహారాలు తినమని చెబుతుంటారు. అప్పుడే ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఆరోగ్యం కోసం పండ్లు తప్పనిసరిగా తినమని నిపుణులు సూచిస్తారు.

మనం రోజూ తినే ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు సమృద్ధిగా అందాలంటే సమతుల ఆహారం తప్పనిసరి. అందులో భాగంగా పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాంటి పండ్లలో ఒకటి సపోటా. ఈ పండు తింటే సహజసిద్ధంగా ఎనర్జీ లభిస్తుంది. మరి ఈ పండు విశేషాలేంటో చూద్దామా…

తియ్యగా ఉండే సపోటా పండు, మామిడి పండుతో సమానంగా రుచిగా ఉంటుంది. రోజు రెండు సపోటా పండ్లు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేకం కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది మన శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. అంతేకాదు, మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.

సపోటాలో విటమిన్లు B, C, E, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరిచి, దగ్గు, జలుబు వంటి చిన్న వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

రెగ్యులర్‌గా సపోటా పండ్లను తీసుకోవటం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అంతేకాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఇందులో ఉన్న విటమిన్ E, A, C కారణంగా చర్మం సహజంగా మెరుస్తుంది.

దృష్టి సమస్యలతో బాధపడేవారికి సపోటా మంచిగా పనిచేస్తుంది. ఈ పండులో విటమిన్ A అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యకరమైన పేగు కదలికలకు మేలు చేస్తుంది. ఇది కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. సపోటాలోని అధిక ఫైబర్ శరీరంలో పేరుకుపోయిన మలినాలను కరిగించడంలో సహాయపడుతుంది.

సపోటా పండు మంచి రుచినే కాదు, మన శరీరానికి కావాల్సిన అనేక పోషక విలువలను అందిస్తుంది. ఈ పండులో కొలెస్ట్రాల్ పెంచే గుణాలు లేవు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

సపోటాలో విటమిన్ B, E పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో ఇది జీర్ణశక్తిని మెరుగుపరిచి, జీర్ణకోశ సమస్యలను నివారిస్తుంది. అయితే, డయాబెటిక్ ఉన్న వారికి సపోటా పండు మంచిది కాదంటారు నిపుణులు. వీటిలో షుగర్ లెవల్స్ త్వరగా పెరిగే గుణం ఉందని చెబుతారు.

సాధారణ వ్యక్తులకు మాత్రం ఇది ఆరోగ్యాన్ని అందించే పండుగా చెప్పవచ్చు. అయితే ఆరోగ్య సమస్యలున్నవారు సపోటా తినాలంటే, తప్పకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

రోజుకు రెండు సపోటా పండ్లు తింటే లివర్‌ క్లీన్ అవుతుంది. చెడు కొలెస్ట్రాల్‌కి చెక్ పడుతుంది. జీర్ణశక్తి పెరిగి, మీ శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు అందుతాయి. అయితే ఆరోగ్య పరిస్థితిని బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.

Leave a Reply