ప్రేమించి పెళ్లి.. ఇప్పుడు విడాకుల దిశగా మరో టీమిండియా క్రికెటర్!

ఇటీవల కాలంలో సినీ మరియు క్రీడా రంగాల్లో విడాకుల సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు సినిమా తారలకే పరిమితమైన ఈ ట్రెండ్, ఇప్పుడు క్రికెటర్లలోనూ కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు టీమిండియా ఆటగాళ్లు తమ వైవాహిక జీవితాన్ని ముగించుకున్నారు. తాజాగా, మరో క్రికెటర్ విడాకుల వార్తలతో హాట్ టాపిక్ గా మారాడు.

ఇప్పటికే టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన వైవాహిక జీవితానికి ముగింపు పలకనున్నాడని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో పరస్పరం అన్‌ఫాలో కావడం, ఒకరినొకరు బహిరంగంగా ప్రస్తావించకుండా ఉండటం విడాకుల ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మనీష్ పాండే కూడా విడాకుల బాటలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019లో కన్నడ సినీ నటి ఆశ్రితా శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనీష్, ఇప్పుడు ఆమెతో విబేధాలు తలెత్తడంతో విడిపోవడానికి సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతోంది.

ఈ జంట సోషల్ మీడియాలో పరస్పరం అన్‌ఫాలో అయ్యారు. అలాగే, వివాహ ఫోటోలను కూడా తొలగించడం వల్ల వీరి మధ్య విబేధాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నట్లు, కోర్టులో విడాకుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. తుది తీర్పు వెలువడిన తర్వాత, ఈ జంట విడాకుల గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇటీవలి కాలంలో వైవాహిక జీవితాలను కొనసాగించలేకపోతున్న క్రికెటర్ల సంఖ్య పెరుగుతోంది. వారి వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ జీవితాల మధ్య సమతుల్యత లేకపోవడం, పెరుగుతున్న ఒత్తిళ్లు విడాకులకు కారణమవుతున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. టీమిండియా క్రికెటర్ల మధ్య పెరుగుతున్న ఈ విడాకుల ట్రెండ్, అభిమానులలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇక, మనీష్ పాండే విడాకుల వార్తలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh