ప్రస్తుత కాలంలో గుండెపోటు, స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గుండెపోటు, స్ట్రోక్ ల కారణంగా ఇప్పుడు చాలా మంది మరణిస్తున్నారు. ఈ తరుణంలో చైనా గుడ్ న్యూస్ చెప్పింది.. రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, గుండెపోటులకు కారణమయ్యే ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించడానికి చైనాలోని శాస్త్రవేత్తలు సంభావ్య వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు.. ఈ విశేషాలను ఇప్పుడు తెల్సుకుందాం.
ధమనులలో కొవ్వు ఫలకం పేరుకుపోవడం, వాపు వల్ల ధమనులు గట్టిపడి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.. ఈ పరిస్థితి స్ట్రోక్, లేదా గుండెపోటుకు దారితీస్తుంది. ఈ రకమైన ధమనుల అడ్డంకులను గతంలో స్కాన్‌ల ద్వారా నిర్ధారించారు.. కానీ ఇప్పుడు యాంజియోప్లాస్టీ వంటి శస్త్రచికిత్సా విధానాలతో చికిత్స చేస్తున్నారు.. రక్త నాళాలు మూసుకుపోకుండా నిరోధించడానికి స్టెంట్లను ఉపయోగించటం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రాణాలు తీసే ప్రమాదకర వ్యాధులలో గుండె జబ్బు ఒకటి.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషం లక్షలాది మంది హృదయ సంబంధ పరిస్థితులతో పోరాడుతున్నారు.
ప్రతి గంటకు ఒక వ్యక్తి గుండె జబ్బుతో మరణిస్తున్నట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. కాబట్టి, గుండెపోటు – స్ట్రోక్‌ను నివారించడానికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ఒక విప్లవాత్మక దశ కావచ్చు.. ఎందుకంటే ఇది మరణాలను తగ్గించగలదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వైద్య నిపుణులు ఈ వ్యాధికి చికిత్స చేయడానికి లేదా నివారించడానికి టీకాను ఉపయోగించవచ్చని చాలా కాలం నుంచి పలు పరిశోధనలలో తెలిపారు.. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం… ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో గుండె సంబదిత రిస్క్ ను తగ్గించగల వ్యాక్సిన్ గురించి వివరించింది. అయితే నానో వ్యాక్సిన్ ఎలుకలను అథెరోస్క్లెరోసిస్ నుంచి ఎంతకాలం రక్షిస్తుందో అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు జరగనున్నాయి.