వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తాయి. రాశులలో వివిధ గ్రహాల కలయిక కారణంగా శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి. అయితే అతి త్వరలో పంచగ్రాహి, సప్త గ్రాహి యోగాలు ఏర్పడబోతున్నాయి. దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ఈ యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తున్నాయి. సప్త గ్రాహి యోగం.. అదృష్ట రాశులు మార్చి 29వ తేదీన శని గ్రహం మీనరాశిలోకి ప్రవేశించడంతో పాటు, అనేక గ్రహాలూ మీనరాశిలో ఉండటం కారణంగా సప్త గ్రాహి యోగం ఏర్పడుతుంది. శుక్రుడు, బుధుడు, సూర్యుడు, చంద్రుడు, శని, రాహువు, శక్తివంతమైన యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇక ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.
వ్యక్తిగత జీవితంలో పురోగతి కూడా కలుగుతుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం. శని సంచారంతో పాటు సప్తగ్రాహి యోగం ఏర్పడడం వల్ల మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మిధున రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. మీరు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. కెరీర్ పరంగా మిధున రాశి వారి కష్టాలు తొలగిపోతాయి. వ్యాపారవేత్తలకు ఇది చాలా అదృష్ట సమయం. ఇక కన్యా రాశి వారికి సప్తగ్రాహి యోగం కారణంగా అద్భుతమైన లాభాలు వస్తాయి. కన్యా రాశి జాతకులు ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరుగుతుంది. జీవితంలో ఎప్పుడు పొందలేని లాభాలను పొందుతారు. వీరి వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది.
కన్యా రాశి వారికి భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. సమాజంలో ఊహించని స్థాయిలో ప్రజాధరణ పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి కార్యాలయాలలో గౌరవం లభిస్తుంది. సప్త గ్రాహి యోగం వల్ల కర్కాటక రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా అద్భుత ఫలితాలు వస్తాయి, వర్తక వ్యాపారాలు చేసేవారికి వృద్ధి సాధ్యమవుతుంది. వీరికి ఉద్యోగాలు చేస్తే పదోన్నతులు కలుగుతాయి . విదేశాలకు వెళ్లాలనుకునే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల అద్భుతమైన లాభాలను కూడా పొందుతారు.
ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలతో ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని PM 7 Bhakthi ధ్రువీకరించలేదు.