తొలి ముద్దు మర్చిపోలేకపోతున్న సమంత..15 ఏళ్లు అయిందంటూ ట్వీట్

హీరోయిన్ సమంతకు వున్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేశావే అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత.. తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.ఈ సినిమా వచ్చి 15 ఏళ్లు అయింది. అంటే సమంత ఇండస్ట్రీలో 15 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన 15 ఏళ్ల కెరీర్ గురించి గుర్తు చేసుకుంటూ.. అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు.. మరెన్నో చేదు అనుభవాలున్నాయంటూ గత జ్ఞాపకాలను చెప్పుకొచ్చింది.

జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలన్నా కుదరదని.. కానీ కొన్నింటిని మాత్రం ఇట్టే మరిచిపోతామంటూ సమంత తెలిపింది. ముఖ్యంగా తను నాగచైతన్యతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సినిమాను సమంత ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఏ మాయ చేసావే సినిమాలో ప్రతీ సీన్ తనకు గుర్తుందని.. గేట్ దగ్గర నిలబడి కార్తీక్ ను కలిసే సన్నివేశం తనకు ఫస్ట్ సీన్ అని గుర్తుచేసుకున్నారు సమంత. వీరిద్దరు కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేశావే లో ఈ జంట ఓ రేంజ్‌లో రెచ్చిపోయి నటించారు.

ఈ మూవీలో చైతూ, సమంత రొమాంటిక్ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను..ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకుంటాయి. ఇక చైతూ, సమంత లిప్ లాక్స్‌తో రెచ్చిపోయి నటించిన ట్రైన్ సీన్‌ అభిమానులను ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చైతూ, సమంత మధ్య ప్రేమ చిగురించడంతో ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కేవలం ఐదు సంవత్సరాల్లోనే వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకోవడం జరిగింది. అటు తర్వాత ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.

2017లో పెళ్లి చేసుకున్న చైతూ, సమంత.. 2021లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తన జీవితంలోనూ.. అలాగే ఇన్నేళ్ల కెరీర్‌లోనూ ఎన్నో చూసానని.. తన బలమేంటి.. బలహీనతలేంటి అనే విషయం అర్థమైందని తెలిపారు సమంత. రాబోయే 15 ఏళ్ళ మంచికాలం కోసం వేచి చూస్తున్నానని సమంత తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh