Viral video of Dhoni beating the cameraman…
IPL 2024: ఈ కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన లక్నో సూపర్‌జెయింట్స్‌కు మార్కస్ స్టోయినిస్ తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. అద్భుతమై ఆటతో చెలరేగిన స్టోయినిస్ 63 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 13 ఫోర్లతో అజేయంగా 124 పరుగులు చేశాడు. ఈ తుఫాన్ బ్యాటింగ్‌తో లక్నో సూపర్‌జెయింట్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
MS Dhoni Video
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 లో 39వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్‌తో తలపడింది. చెన్నై చెపాక్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో ధోని వాటర్ బాటిల్‌తో కెమెరామెన్‌పై విరుచుకపడ్డాడు.
17వ ఓవర్లో ఎంఎస్ ధోని డ్రెస్సింగ్ రూమ్‌లో నిలబడి బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. కెమెరామెన్ ధోనిని పెద్ద స్క్రీన్‌పై చూపించడంపై దృష్టి సారించాడు.
ధోని బుల్లితెరపై కనిపించడంతో అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. దీన్ని గమనించిన ధోని వాటర్ బాటిల్‌ను కెమెరాపైకి విసురుతున్నట్లు కనిపించాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే తరపున రుతురాజ్ గైక్వాడ్ (108) సెంచరీ సాధించాడు. ఈ సెంచరీ సాయంతో సీఎస్కే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.
ఈ కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన లక్నో సూపర్‌జెయింట్స్‌కు మార్కస్ స్టోయినిస్ తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. అద్భుతమై ఆటతో చెలరేగిన స్టోయినిస్ 63 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 13 ఫోర్లతో అజేయంగా 124 పరుగులు చేశాడు. ఈ తుఫాన్ బ్యాటింగ్‌తో లక్నో సూపర్‌జెయింట్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.Viral video of Dhoni beating the cameraman…
For More Information click here