IPL 2024: Hardik has mental health problems…
IPL 2024: హార్దిక్‌కు మానసిక ఆరోగ్య సమస్యలు.. ముంబై కెప్టెన్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ 17వ ఎడిషన్ ముంబై ఇండియన్స్‌కు పెద్దగా అచ్చి రాలేదు. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలతో ఆ జట్టుకు షాక్ ల మీద షాక్ లు తగిలాయి. జట్టును విజయ పథంలోకి తీసుకొచ్చేందుకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అతనికేవీ కలిసి రావడం లేదు.
దీనికి తోడు పాండ్యాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఇప్పటికీ ఆగడం లేదు. హార్దిక్ పాండ్యా ముంబై జట్టులోకి వచ్చినప్పటి నుంచి మొదలైన ఈ ట్రోలింగ్.. కెప్టెన్సీ విషయంలో మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది.
ఆ తర్వాత ఆ తర్వాత జట్టు వరుస పరాజయాలకు కారణమంటూ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా నిత్యం ట్రోలింగ్ కు గురవుతున్న పాండ్యా ఇవేమీ పట్టించుకోకుండా తన ఆటపై శ్రద్ద చూపిస్తున్నాడు.
అయితే నిత్యం విమర్శలు, ట్రోలింగ్ చేయడం వల్ల పాండ్యా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప హార్దిక్ పాండ్యా గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై కెప్టెన్ తీవ్ర ఒత్తిడలో ఉన్నాడని, అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
తన యూట్యూబ్ ఛానెల్లో హార్దిక్ మానసిక స్థితి గురించి రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ, హార్దిక్‌కు ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్‌గా ఎదిగే అవకాశం ఉందని చెప్పాడు. అయితే తనకు వ్యతిరేకంగా జరుగుతున్న వాటి వల్ల హార్దిక్ ఖచ్చితంగా మానసిక సమస్యలతో పోరాడుతున్నాడని ఉతప్ప చెప్పాడు. ‘భారత అభిమానుల మనోభావాలను నేను అర్థం చేసుకున్నాను, కానీ ఏ ఆటగాడి పట్లా ఇలాంటి ప్రవర్తన సరైనది కాదు.
ఈ రకమైన ప్రవర్తన నిజంగా అసభ్యంగా ఉంటుంది. మనం ఎవరితోనూ ఇలా ప్రవర్తించకూడదు. దీన్ని చూసి నవ్వకూడదు, ఏ విధంగానూ ముందుకు తీసుకెళ్లకూడదు’ అని ఊతప్ప హార్దిక్ కు మద్దతుగా నిలిచాడు.IPL 2024: Hardik has mental health problems…
ముంబై ఇండియన్స్ జట్టు:
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (WK), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వల్, క్వీనా మఫకా, నమన్ ధీర్, నేహాల్ వధేరా, షమ్స్ ములానీ, శ్రేయాస్ గోపాల్, ల్యూక్ వుడ్, హర్పిత్ దేశాయ్, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, శివాలిక్ శర్మ, అన్షుల్ కాంబోజ్, నువాన్ తుషార, డెవాల్డ్ బ్రీవిస్.
For More Information Click here