“Today’s a big moment on CM Jagan’s bus tour.
CM Jagan: జగన్ బస్సు యాత్రలో నేడు కీలక ఘట్టం.. అందరి దృష్టి ఆ బహిరంగ సభ పైనే
ఏపీలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 16వ రోజుకి చేరుకుంది. సీఎం బస్సుయాత్రకు విశేష స్పందన కనిపిస్తుంది. అడుగడునా జననీరాజనాలు పలుకుతున్నారు. ఇవాళ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నారాయణపురం నుంచి ఈతకోట వరకూ సాగనుంది…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. విజయవాడలో రాళ్ల దాడిలో గాయపడిన సీఎం ఒక రోజు విశ్రాంతి తీసుకొని మళ్లీ యాత్రను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నారాయణపురం నుంచి ఈతకోట వరకూ యాత్ర సాగనుంది. ఇక భీమవరంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో జగన్ ఏం మాట్లాడుతారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఏపీలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 16వ రోజుకి చేరుకుంది. సీఎం బస్సుయాత్రకు విశేష స్పందన కనిపిస్తుంది. అడుగడునా జననీరాజనాలు పలుకుతున్నారు. ఇవాళ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నారాయణపురం నుంచి ఈతకోట వరకూ సాగనుంది. ఉదయం 9 గంటలకు నారాయణపురం రాత్రి బస నుంచి బయలుదేరుతారు సీఎం జగన్. Today’s a big moment on CM Jagan’s bus tour.
నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకొని ఉండి శివారులో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ దగ్గర సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారుకి చేరుకొని.. రాత్రికి అక్కడ బసచేస్తారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా
మరోవైపు ఇవాళ్టి జగన్ మేమంతా బస్సు యాత్రపై ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో ఇవాళ బస్సు యాత్ర జరుగుతుండడంతో జగన్ ప్రసంగంపై ఆసక్తిరేకెత్తిస్తుంది. ఇప్పటికే ఉండి టికెట్ విషయంలో కూటమిలో కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. దీంతో ఉండి టికెట్ విషయంలో కూటమిపై సీఎం జగన్ పదునైన సెటైర్లు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.మరోవైపు భీమవరం సీటును జనసేన పార్టీ ఛాలెంజ్‌గా తీసుకుంది. భీమవరంలో ఈసారి ఎలాగైనా గెలవాలి.. గ్రంధి శ్రీనివాస్‌ని గద్దె దించుతామని శపథం చేశారు పవన్. భీమవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పవన్ కల్యాణ్. గత ఎన్నికల్లో భీమవరం నుంచి ఓడిపోయిన పవన్.. ఈసారి మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులును జనసేన నుంచి పోటీ చేయిస్తున్నారు.
భీమవరాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనన్నారు పవన్. కుబేరులు ఉండే భీమవరం ఒక రౌడీ చేతుల్లో బందీ అయిందని ఆరోపించారు. జగన్‌కు యుద్ధం భీమవరం నుంచే ఇద్దామన్న పవన్.. ఇక్కడ ఉండే జగన్ జలగతో సహా వీధిరౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చంటూ ఘాటైన విమర్శలు చేశారు. ఇలాంటి క్రమంలో పవన్ టార్గెట్ గా జగన్ డోస్ పెండడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. పవన్ చేసిన విమర్శలకు దీటుగా జగన్ ప్రసంగం ఉంటుందని తెలుస్తుంది. మొత్తంగా ఇవాళ్టి జగన్ బస్సుయాత్రలో జరిగే పరిణామాలు.. భీమవరంలో బహిరంగ సభలో పవన్ టార్గెట్‌గా ఏం మాట్లాడుతారు? ఏఏ అంశాలను ప్రస్తావిస్తారు? అనేక అంశాలపై.. జగన్ ప్రసంగంపై ఉత్కంఠ కొనసాగుతుంది.