Arjun Sarja :నిరంజన్ సుధీంద్రను టాలీవుడ్ కి పరిచయం చేయనున్న అర్జున్ సర్జా
Arjun Sarjaప్రియాంక ఉపేంద్ర నటించిన సెకండ్ హాఫ్ తో కెరీర్ ను ప్రారంభించి నాన్ హుదుగారు కథే చిత్రంలో నటించిన ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ సుధీంద్ర ప్రస్తుతం హంటర్ షూటింగ్ చివరి దశలో ఉన్నాడు.
ఈ యువ నటుడు ఇప్పుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు మరియు ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించి, నిర్మించనున్న అర్జున్ సర్జాతో కలిసి పనిచేయనున్నాడు. ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ట్రైలర్ తో పాటు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.
తెలుగు, కన్నడ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో నిరంజన్ ప్రస్తుతం తన పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నాడు. జులైలో సెట్స్ లో జాయిన్ కానున్నాడు. ఐశ్వర్య తెలుగు తెరంగేట్రం చేస్తున్న నేపథ్యంలో అర్జున్ సర్జా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అర్జున్ సర్జా కొత్త స్క్రిప్ట్ పై వర్క్ చేశాడని, ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడని వార్తలు వస్తున్నాయి.
కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిరంజన్ సుధీంద్ర రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా మేజర్ పార్ట్ ను హైదరాబాద్ లో షూట్ చేయనున్నారు అని సమాచారం.
ఇదిలా ఉంటే మధ్యలో ఆగిపోయిన సూపర్ స్టార్ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు నిరంజన్. ప్రస్తుతం ఈ నటుడు హంటర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు, ఇది చివరి దశలో ఉంది. నిరంజన్ డబ్బింగ్ ప్రక్రియను పూర్తి చేయగా, ఒక ఫైట్ సీక్వెన్స్, ఒక పాట మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.