Heavy Rains: తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. …
Heavy Rains: తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. చెన్నై వ్యాప్తంగా సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిశాయి. అయితే ఈ నేపధ్యంలో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు మరియు రాణిపేట జిల్లాల్లోని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
నిన్న రాత్రి చెన్నై అంతటా విస్తారంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. మీనంబాక్కంలో ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 5.30 గంటల వరకు 137.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ లేదా ఐఎండీ తెలిపింది.
తారామణి మరియు నందనంలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్‌లు (ARGs) దాదాపు 12 సెం.మీ వర్షపాతాన్ని నమోదు చేశాయి, ఆ తర్వాత చెంబరంబాక్కంలో 11 సెం.మీ వర్షం కురిసింది.
ఐఎమ్ డి నివేదిక ప్రకారం, సోమవారం తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకల్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములుHeavy Rains: మరియు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురుస్తుంది.
కాంచీపురం, చెంగల్పట్టు, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, విల్లుపురం, కడలూరు, మైలదుత్తురై, నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, తిరుచ్చి, అరియలూర్, పెరంబలూరు, అలాగే పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలతో పాటు 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మంగళవారం నుంచి గురువారం వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.