Tirumala : నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల విడుదల
Tirumala : కలియుగ దైవం శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామి చెంతకు భక్తుల రద్దీ కొనసాగుతోంది.
31 కంపార్టుమెంట్లలో దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
ఇక ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
అయితే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టిటిడి షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి తిరుమల
శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల సెప్టెంబరు నెల కోటాను కోటా విడుదలకు టీటీడీ నిర్ణయించింది.
తాజాగా సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ పలు నిర్ణయాలు అమలు చేస్తోంది.
వెండివాకిలి నుంచి సింగిల్ లైన్ విధానం పాటిస్తోంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ నెల 19న తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది.
సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన, Tirumala : ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు
ఈ నెల 19 నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి.
అదే సమయంలో భక్తులు లక్కీడిప్ కోసం తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనున్నారు.
అదే రోజున ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను కూడా విడుదల చేయనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.
అదే రోజున (జూన్ 22) ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల Tirumala : టికెట్లను కూడా ఆన్ లైన్ లో ఉంచనున్నారు.
ఈ నెల 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
ఇక నిన్న ఆదివారం 87,762 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 43,753 మంది తలనీలాలు అర్పించారు.
రూ 3.61 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చింది. కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. ఇక తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30,654గా ఉంది.