Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ
Tirumala :తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసినా తిరుమలకి భారీ సంఖ్యలో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. స్కూళ్లల్లో ఒంటిపూట బడులు సాగుతున్న నేపథ్యంలో మరో వారం రోజులపాటు రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
గురువారం 70,896 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శన అనంతరం కానుకల రూపంలో హుండీలో శీవారికి రూ.4.07 కోట్ల రూపాయలు చెల్లిచారు భక్తులు. ఇక శుక్రవారం12 గంటల సమయంలో శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి కృష్ణ తేజ అతిధి గృహం వరకు క్యూలైన్ కిక్కిరిసిపోయింది.
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.
గతంలో గోవిందరాజ స్వామి ఆలయానికి సమీపంలోని ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి ఆలయ రథాన్ని సందర్శించి సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వదంతులను నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.