Kerala : నేడు కేరళని తాకిన ఋతుపవనాలు
Kerala : రాష్ట్రాన్ని నైరుతి రుతు పవనాలు తాకాయి. అధికారికంగా ప్రకటించింది భారత వాతారవణ శాఖ. 2023, (జూన్ 8వ తేదీ) ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రుతు పవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు అనౌన్స్ చేసింది.
అయితే వాతావరణ పరిస్థితుల ప్రతికూలత కారణంగా వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి వచ్చాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది.
అసలు ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో నైరుతి దేశంలో ప్రవేశిస్తుంటాయి.
అయితే వాతావరణంలో అనివార్య మార్పులు కారణంగా ఈసారి వాటి రాక మరింత ఆలస్యమవుతుందని.
జూన్ రెండోవారంలో దేశంలోకి వచ్చే అవకాశం ఉందని ముందు అంచనా వేశారు.
ప్రతికూల పరిస్థితుల కారణంగా కాస్త ఆలస్యంగా ఈసారి రుతుపవనాలు కేరళను తాకాయి.
భారత్ భూభాగంలోకి వచ్చిన నైరుతి రుతుపవనాలు కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో విస్తరించినట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
నైరుతి రుతుపవనాల రాకతో 24 గంటల పాటు వర్షాలు కురవబోతున్నాయి. ఇప్పటికే అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాల్లో జోరువానలు పడుతున్నాయి.
అక్కడి వాతావరణ శాఖ ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రానున్న 48 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాలు, బంగాళాఖాతంలోని కొన్ని
ప్రాంతాలు, కొన్ని ఈశాన్య రాష్ట్రాలతో సహా పలు ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించేందుకు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది.
అండమాన్ & నికోబార్ దీవులు, మణిపూర్, మిజోరాం, కేరళ , మహేలలోని వివిక్త ప్రదేశాల్లో గురువారం భారీ వర్షపాతాన్ని ఐఎండీ అంచనా వేసింది.
రాజస్థాన్, అండమాన్ & నికోబార్ దీవులు, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం, రాయలసీమలోని పలు ప్రదేశాలలో కూడా ఉరుములు, Kerala : మెరుపులతో 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే
అవకాశం ఉంది.అదనంగా, కోస్టల్ & సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ & మాహేలో 30-40 కి.మీ వేగంతో మెరుపులు, ఈదురు
గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.హిమాచల్ ప్రదేశ్, గంగానది పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్,
నేడు కేరళని తాకిన ఋతుపవనాలు
అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు,
పుదుచ్చేరి, లక్షద్వీప్‌ల్లో వర్షాలతో పాటు పిడుగులు పడవచ్చని ఐఎండీ అంచనా వేయబడింది.
ఐఎండీ డేటా ప్రకారం గత 150 ఏళ్లలో కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే తేదీ మారుతూ వస్తోంది. 1918లో మే 11న రుతుపవనాలు
అత్యంత ముందుగా రుతుపవనాలు వస్తే.1972లో జూన్ 18న అత్యంత ఆలస్యంగా కేరళలోని ప్రవేశించాయి.
గత ఏడాది మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న, 2019లో జూన్ 8న, 2018లో మే 29న రుతుపవనాలు వచ్చాయి.
అసలు రుతుపవనాలు భారతదేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈసారి రుతపవనకాలంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ.
భారత్ లో ఈ సారి సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
వాయువ్య భారతదేశంలో సాధారణం నుండి సాధారణం కంటే తక్కువKerala : వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
తూర్పు మరియు ఈశాన్య, మధ్య మరియు దక్షిణ ద్వీపకల్పంలో దీర్ఘకాల సగటులో 94-106 శాతం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
సగటు 90 శాతం కంటే తక్కువగా ఉంటే లోటు వర్షపాతంగా.. 90-95 శాతం మధ్య ఉంటే సాధారణ కన్నా
తక్కువగా, 105-110 శాతం ఉంటే సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతంగా పరిగణిస్తారు.