Janasena Pawan Kalyan : కండువా కప్పుకొనున్న ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు
Janasena Pawan Kalyan : బాపట్ల జిల్లా చీరాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ను నివాసంలో కలిశారు . నాగబాబు, నాదేండ్ల మనోహర్‌ను కూడా స్వాములు, ఆయన కుమారుడు రాజేంద్రలు కలిశారు. జనసేన పార్టీకి తన అవసరమేరకు పని చేస్తానని పవన్‌కు స్వాములు తెలిపినట్లు చెబుతున్నారు. ‘మీ లాంటి పెద్దలు పార్టికి ఏంతో అవసరమని’ పవన్ స్వాములతో అన్నారు.
అయితే ఈ నేపధ్యంలో స్వాములు జనసేన పార్టీలో చేరడానికి మంచి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. దీంట్లో భాగంగానే జూన్ 12న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ వారాహి యాత్రకు ముందే అంటే 12న మంగళగిరి లోని పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ నిర్వహించే పూజా సమయంలోనే జనసేన పార్టీలో చేరాలని ఆమంచి స్వాములు నిర్ణయించుకున్నారు.
జనసేన నుండి తనకు సీటు ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని పవన్ కల్యాణ్ విధానాలు నచ్చి..ఆయన ఆలోచనలు నచ్చి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని స్వాములు చెబుతున్నారు. జనసేన పార్టీ బలోపేతం కోసమే తాను పనిచేయాలని పదవుల కోసం కాదని తెలిపారు. కానీ పార్టీ టికెట్ ఇస్తే పోటీలో ఉంటానని. అయితే టికెట్ ఇవ్వకపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. అప్పుడే పా ర్టీ మార్పుపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. 2009లో ఆమంచి కృష్ణ మోహన్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా చీరాల నుంచి గెలిచారు. 2014 ఎన్నికల్లో మాత్రం నవోదయం పార్టీ నుంచి Janasena Pawan Kalyan : పోటీచేసి విజయం సాధించారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కానీ అనూహ్యంగా 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడారు.
కొద్ది రోజులకు చీరాల ఎమ్మెల్యే కరణం అనూహ్యంగా వైఎస్సార్‌సీపీకి దగ్గరయ్యారు. కొంతకాలానికి ఆమంచికి చీరాలలో ప్రాధాన్యం తగ్గింది బలరాం వర్గంతో వర్గపోరు మొదలయ్యింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కూడా సైలెంట్ అయ్యారు.. పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఆ తర్వాత చీరాల బాధ్యతల్ని కరణం బలరాం కుటుంబానికి అప్పగించి..ఆమంచిని పర్చూరు ఇంఛార్జ్‌గా నియమించారు. ఇప్పుడు ఆమంచి సోదరుడు స్వాములు జనసేన పార్టీ వైపు చూడటం ఆసక్తికరంగా మారింది. ఆయన చీరాల నుంచి బరిలోకి దిగుతారనే చర్చ కూడా మొదలైంది. తన కుమారుడ్ని కూడా వెంట తీసుకెళ్లడంతో. రాజకీయాల్లోకి తీసుకొస్తారా అనే చర్చ జరుగుతోంది.