Odisha Train Accident
భారతదేశ రైల్వే చరిత్రలో అతిపెద్ద విషాదంగా చెబుతున్న ఘోర రైలు ప్రమదం తాజాగా ఒడిశాలో జరిగింది. వందల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడగా మరికొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు. అసలు ఈ ప్రమాధం ఎలా జరిగింది. కారణాలు ఏమిటి సాంకేతిక లోపం ఏమిటి అనే విషయం తెలియాలిసివుంది.
నిన్న (జూన్ 2)వ తేదీ శుక్రవారం సాయంత్రం బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్ లోని హావ్ డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్ డా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద పట్టాలు తప్పడంతో దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ పై పడిపోయాయి. సాయంత్రం సరిగ్గా 6 గంటల 55 నిమిషాల 28 సెకన్లకు గంటకు 128 కిలోమీటర్ల వేగంతో షాలిమార్ – చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆ బోగీలను ఢీకొట్టింది.
సాధారణంగా గంటకు దాదాపు 130 కి.మీ. వేగంతో వెళ్లే రైలు వేగం సున్నాకు చేరుకునేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే 60 నుంచి 80 సెకన్లకు పైగా సమయం పడుతుందట. కానీ ప్రమాదం జరిగి 23 సెకన్లలోనే వేగం జీరో కు చేరుకుందంటే పట్టాలపై ఉన్న బోగీలను కోరమండల్ ట్రైన్ ఎంత బలంగా ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 50 మందికి పైగా మరణించగా ఈ ప్రమాదంలో 350 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సోరో, గోపాల్‌పూర్, ఖంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్య అధికారులు తెలిపారు. చీకటిలోనూ రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సహాయక చర్యల్లో NDRF చెందిన 3 యూనిట్లు, ODRAF చెందిన 4 యూనిట్లు పాల్గొంటున్నాయి. అదే సమయంలో 60 అంబులెన్స్‌లు రెస్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ప్రమాదం తర్వాత అనేక రైళ్లను దారి మళ్లించారు. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ షాలిమార్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో మొత్తం 13 బోగీలు మరో ట్రాక్‌పై పడ్డాయి. ఆ తర్వాత కాసేపటికే పక్క ట్రాక్‌పై వస్తోన్న యశ్వంత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు ‘కోరమాండల్’ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలులో నాలుగు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. అయితే, ఇప్పటి వరకు ఎంతమంది ప్రయాణికులు మృతి చెందారనే వివరాలను అధికారులు అధికారికంగా స్పష్టం చేయలేదు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా SRC కంట్రోల్ రూమ్‌కు చేరుకుని ఘటనను పరిశీలించి రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు. హెల్ప్ నంబర్లు కూడా జారీ చేశారు. క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించేందుకు రైల్వే బృందం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషాద రైలు ప్రమాద పరిస్థితిని తాను ఎప్పడికప్పుడూ సమీక్షిస్తానని సీఎం తెలిపారు. సీఎం నవీన్ పట్నాయక్ ఈ ఉదయం సంఘటన స్థలాన్ని సందర్శించరు.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
#BalasoreTrainAccident | "I was nearby when this accident happened, we rescued around 200-300 people," says Ganesh, a local #OdishaTrainAccident pic.twitter.com/d8PkJNEPRY
— ANI (@ANI) June 3, 2023