Pawan Kalyan Varahi Tour
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముహుర్తం ఖరారయింది. ఈ నెల 14వ తేదీన అన్నవరంలో పూజలు చేసి వైఎస్ఆర్సీపీపై దండయాత్ర ప్రారంభించబోతున్నారు.
జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. పీఏసీ సభ్యులతో నాదెండ్ల మనోహర్ సమావేశమై పవన్ పర్యటనపై చర్చించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ సందర్భంగా తొలి విడత రూట్ మ్యాప్ ను జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ మనోహర్ ప్రకటించారు.
యాత్రలో భాగంగా ప్రతీ రోజూ..ఓ చోట్ల ఫీల్డ్ విజిట్ ఉంటుందని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
అయితే తొలి విడత యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో జరగనుంది. ప్రారంభ యాత్ర అన్నవరం నుంచి భీమవరం వరకు సాగుతుందని
… ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో పవన్ తొలివిడత యాత్ర సాగుతుందని నాదెండ్ల వెల్లడించారు.
యాత్రలో భాగంగా వివిధ వర్గాలతో కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని ముందుకు పోతామని వెల్లడించారు.
జనసేన ద్వారా ప్రజలకు భరోసా కల్పించేలా యాత్ర ఉంటుందని నాదెండ్ల వివరించారు.
జనసేన యాత్రతో క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. వైసీపీ నుంచి విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వారాహి యాత్ర చేపట్టాలని Pawan Kalyan ఎప్పుడో నిర్ణయించుకున్నారు.
వాహనం రెడీ అయి ఆరు నెలలు అవుతుంది. అయితే గతంలో ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న కారణంగా వాహనాన్ని రెడీ చేయించుకున్నరు. కానీ ముందస్తుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధపడకపోవడంతో పవన్ యాత్రను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికుల దగ్గర పడటం
.. తెలంగాణతో పాటు ఏపీకి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ప్రారంభం కావడంతో.. సినిమాలకు టైట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ.., రాజకీయ యాత్రల కోసం సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
అయితే వారాహి యాత్రపై మొదట నుంచి ఒకరకమైన అంచనాలు ఉన్నాయి. ఈ యాత్రతో జనసేన గ్రాఫ్ పెరుగుతుందని జన సైనికులు అంచనా వేస్తున్నారు. కానీ వారాహి వాహనం మాత్రం ఇంతవరకూ రోడ్డెక్కలేదు. పార్టీ ఆవిర్భావ సభకు విజయవాడ నుంచి బందరుకు వారాహి వాహనంపై పవన్ బయలుదేరారు జనసేనాని.