Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Telangana

Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Telangana : రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతోంది. 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. 2023 జూన్ 2న తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెడుతోంది.

ఈ సంధర్బంగా అన్ని రాజకీయ పార్టీలు ఘనంగా వేడుకలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అటు పార్టీ తరఫున, ఇటు ప్రభుత్వం తరఫున పండుగ చేస్తుంటే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గోల్కొండ కోటలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది

. మరోవైపు కాంగ్రెస్ కూడా తెలంగాణను ఇచ్చింది తామేనంటూ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేస్తోంది. వామపక్షాలతో పాటు మిగతా పార్టీలు కూడా వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నాయి. మరికొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న క్రమంలో.. ప్రజలకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలన్నీ దూకుడుగా ముందుకు వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది.

నూతన సచివాలయం వేదికగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ అవతరణ వేడుకలను నిర్వహిస్తోంది. శుక్రవారం సీఎం కేసీఆర్  సచివాలయంలో జాతీయ జెండాను ఎగుర వేసి గత తొమ్మిదేళ్ల ప్రగతి వివరించనున్నారు. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ముఖ్య ప్రజాప్రతినిధులు జాతీయ పతకాలు ఆవిష్కరిస్తారు.

గాంధీభవన్‌లో తెలంగాణ వేడుకలు 

రాష్ట్రాన్ని ఇచ్చింది తామేనని చెపుతున్న కాంగ్రెస్‌.. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర పదో ఆవిర్భావ వేడుకల సందర్భంగా టీపీసీసీ వినూత్న పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. సోనియా గాంధీ  ఫొటోకు పాలాభిషేకం చేయాలని డిసైడ్‌ అయ్యారు హస్తం నేతలు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తెలంగాణను ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే అంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలు మమ్మల్నే ఆదరిస్తారని దీమా వ్యక్తం చేస్తున్నారు. Telangana : సాధకురాలు సోనియా గాంధీయేనని చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ చిత్రపాటానికి పాలాభిషేకం చేయడానికి రెడీ అయ్యారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో వేడుకలను ప్లాన్‌ చేసింది కాంగ్రెస్. ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ వచ్చిన మీరా కుమార్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువరు మాజీ ఎంపీలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. యూపీఏ సర్కారు తెలంగాణ ఇచ్చిన సమయంలో మీరా కుమార్ లోక్ సభ స్పీకర్ గా ఉన్నారు.

ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది. ఉదయం 11.00 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరులకు లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 11.15 గంటలకు నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ పాదయాత్రను మీరా కుమార్ ప్రారంభిస్తారు. ఈ పాదయాత్ర అబిడ్స్ నెహ్రూ విగ్రహం మీదుగా గాంధీభవన్ కు చేరుకుంటుంది.

అనంతరం గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుంది. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ సీనియర్ నాయకులు పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రముఖులను సన్మానిస్తారు.

 గోల్కొండ కోటలో బీజేపీ వేడుకలు

కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వహిస్తోంది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో గోల్కొండ కోటపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. గతేడాది ఢిల్లీలో ఈ వేడుకలను నిర్వహించిన కేంద్రం తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. ఎంతో మంది అమరవీరుల బలిదానాలు, మరెందరో పోరాటాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. ఈ పోరాటాలు, త్యాగాలను అంతా కలిసి స్మరించుకుందాం, వేడుకలు చేస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించడం  ఒకింత ఆశ్చర్యం  కలిగిస్తుంది .

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh