Khairatabad: మహాగణపతి 61 అడుగులు.

Khairatabad:

Khairatabad: మహాగణపతి 61 అడుగులు.

Khairatabad: వినాయక చవితి పండుగను తెలంగాణ రాష్ట్రoలో  ఘనంగా నిర్వహిస్తారు. గణేష్‌ చవితి అనగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని Khairatabad: గణేషుడే. ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకునే ఆ మహాగణపతి.. ఈ ఏడాది కూడా భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతున్నాడు.

అయితే త్వరలో రానున్న వినాయక చవితిని పురస్కరించుకొని  ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిర్మాణానికి  2023 మే 31 బుధవారం రోజున నిర్జల ఏకాదశి పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతి ఏర్పాటు కోసం కర్రపూజను సాయంత్రం 5 గంటలకు నిర్వహించారు. ఈ పూజతో గణనాథుడి విగ్రహ నిర్మాణ పని ప్రారంభమైంది.

ఈసారి 69వ సంవత్సరం సందర్భంగా  ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌కు అంకితమిస్తూ 61 అడుగుల మట్టి వినాయకుడిని తయారుచేయాలని నిర్ణయించినట్లు కన్వీనర్‌ సందీప్‌రాజ్‌ తెలిపారు. వారం రోజుల్లో మహాగణపతి నమూనాను విడుల చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. గత సంవత్సం లాగానే ఈ సంవత్సరం శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌, ఆర్టిస్టు జోగారావు నేతృత్వంలో మట్టి మహాగణపతి తయారు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆలాగే వచ్చేవారం వినాయకుడికి సంబంధించిన పోస్టర్ ను  రిలీజ్ చేయనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.

గత ఏడాది కూడా మట్టితోనే తయారు చేసిన 50 అడుగుల ఎత్తైన శ్రీపంచముఖ మహాలక్ష్మీ గణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ప్రతిష్టించారు. కాగా, ఇటీవలి కాలంలోనే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సుదర్శన్ ముదిరాజ్ కన్నుమూసిన విషయం తెలిసిందే.
అయితే ఖైరతాబాద్ తోపాటు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా గణనాథులు నిలవనున్నారు.

విభిన్న రూపాల్లో గణనాధులు, పళ్లు, పూజకు అవసరమైన వస్తువులతో రోడ్లన్ని నిండిపోతాయి. వినాయకచవితికి ఒక రోజు ముందే గణేష్ మండపాలకు తరలివెళ్లి గణనాధులు, గణపతిబప్ప మోరియా అనే నినాదాలతో హైదరాబాద్ నగరం మొత్తం మారుమోగిపోతుందన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ప్రతి గల్లీ గల్లీలో భారీ భారీ విగ్రహాలు నెలకొల్పి..డీజేలతో మోత మోగిస్తుంటారు యూత్. నిత్యం అన్నదానాలు..ఎంటర్ టైన్ మెంట్ తో దుమ్ము రేపుతుంటారు.

అంతేనా లడ్డూ వేలం పాటలు ఇలా ప్రతీది సంప్రదాయబద్దంగా.. ఎంతో ఘనంగా జరుగుతుంటాయి ఈ వేడుకలు.ఇక ఉత్సవాలు ముగిసిన అనంతరం నిమజ్జనాలు కూడా అంతే ఘనంగా నిర్వహిస్తుంటారు భక్తులు. హుస్సేన్ సాగర్‌తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 50కి పైగా సరస్సులు ఉన్నాయి. ఇక కృత్రిమ చెరువుల్లో 40 వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh