Avinash: రెడ్డి తల్లికి ఎటువంటి శస్త్రచికిత్స జరగలేదు

Avinash

Avinash: రెడ్డి తల్లికి ఎటువంటి శస్త్రచికిత్స జరగలేదు

Avinash:  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఏపీ ప్రజలు అయోమయంలో  వున్నారు.

ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్ట్ శరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

కాగా అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్‌కు తరలించారు.

కాగా గతవారంలో అవినాష్ రెడ్డి బెయిల్ విషయంలో హైకోర్టులో జరిగిన వాదనల్లో తన తల్లికి శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతోందని కోర్టుకు ఆయన చెప్పారని, దాని ప్రకారం శస్త్రచికిత్స జరగలేదని వివేకా  కుమార్తె సునీతారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ హైకోర్టుకు ఆమె మెమో సమర్పించారు.

తన తల్లి శ్రీలక్ష్మికి గుండె కవాటాలు మూసుకుపోవడంతో ఆపరేషన్ ప్రక్రియ జరుగుతోందని ఎంపీ అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొనడంతో తుది ఉత్తర్వులు జారీ చేసేదాకా తనని అరెస్టు చేయకూడదంటూ హైకోర్టు మే 27న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

సిబిఐ విచారణకు హాజరు కాకుండా, తల్లికి అనారోగ్యమంటూ గైర్హజరైన ఎంపీ అవినాష్‌పై చర్యలు తీసుకోవాలని సునీతరెడ్డి కోర్టుకు ఫిర్యాదు చేశారు.Avinash: తల్లికి ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదని అతనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో సునీతారెడ్డి మెమో దాఖలు చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి గత నెలలో సిబిఐ విచారణకు హాజరు కాలేదు. చివరి నిమిషంలో తల్లికి అనారోగ్యమని వెళ్లిపోయారు.

ఈ క్రమంలో విచారణకు హాజరు కాలేనంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లికి శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతోందని Avinash: రెడ్డి కోర్టుకు చెప్పారని, దాని ప్రకారం శస్త్రచికిత్స జరగలేదని సునీతారెడ్డి బుధవారం తెలంగాణ హైకోర్టుకు మెమో సమర్పించారు.

శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స జరుగుతోందన్న ప్రకటన తప్పు అని, నిర్ధారించడానికి సరైన రికార్డులు లేనందున అవినాష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సునీతారెడ్డి తరఫు న్యాయవాది కోరారు.

శస్త్రచికిత్స జరిగినట్లు రికార్డులేమీ లేవని, మెమోను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది విజ్ఞప్తి చేశారు.

దీనితో సునీతరెడ్డి మెమోను న్యాయమూర్తి స్వీకరించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh