Delhi: సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

Delhi

Delhi: సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉంటున్న ఆప్ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు లో చుక్కెదురైంది.

సిసోడియా బెయిల్ పిటీషన్ ను ధర్మాసనం తిర్కరించింది.

సిసోడియా బెయిల్ పిటీషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ దినేష్ కుమార్ శర్మ తో కూడిన

సింగిల్ జడ్జి ధర్మాసనం ఆయన బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది.

ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిసోదియాపై ఉన్న ఆరోపణలు చాలా

తీవ్రమైనవని ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని.

కాబట్టి బెయిల్‌ ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. సాక్షులలో ఎక్కువమంది ప్రభుత్వ

సేవలకే ఉన్నారని కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేస్తారనే అభిప్రాయాలను తోసిపుచ్చలేమని కోర్టు పేర్కొంటూ బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది.

2021-22 ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ సీబీఐ కేసును ఎదుర్కొంటున్న

ఆమ్ ఆద్మీ పార్టీ నేత మ‌నీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు

మంగళవారం తిరస్కరించింది. దీంతో సిసోడియా తన బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఉత్తర్వులపైDelhi: సుప్రీంకోర్టును

ఆశ్రయించనున్నారు. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో సిసోడియా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

మార్చి 31న సీబీఐ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి ఆయనకు బెయిల్ నిరాకరించారు.

ఆ తర్వాత ఈడీ కేసులో కూడా ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది.

అయితే కోర్టులో జరిగిన వాదనల్లో భాగంగా సిసోడియా తరపు న్యాయవాది దయన్

కృష్ణన్ ఎక్సైజ్ పాలసీని రూపొందించటంలోను..అమలు చేయటంలోను జరిగిన అవకతవకల్లో

తన క్లైంట్ ప్రమేయం ఉన్నట్లుగా సీబీఐ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని వాదించారు.

ఈకేసులో తన క్లైంట్ సిసోడియా మినహా మిగిలిన నిందుతులు అందరు బెయిల్ పై విడుదల అయ్యారని

ఈ సందర్భంగా కోర్టుకు గుర్తుచేశారు. ఈ వాదనలు విన్న జస్టిస్ దినేష్ కుమార్ శర్మ వాటిని తోసిపుచ్చారు.

సిసోదియాపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని సాక్షాలను తారుమారు చేయవచ్చని

వ్యాఖ్యానిస్తు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. హైకోర్టులో బెయిల్ తిరస్కరించిన క్రమంలో

ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించేDelhi:  అవకాశాలున్నట్లుగా సమాచారం.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh