Modi : త్వరలో ఎంపీల సంఖ్య పెరగనున్నది
Modi : నుతన పార్లమెంట్ భవనాన్నిఅట్టహాసం గా ప్రారంబించిన తర్వాత తన మొదటి స్పీచ్ ఇచ్చిన
ప్రధాని ఈ విదం గా వాఖ్యలు చేశారు . ఇది భవనం కాదని, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతీకని
ఆయన చెప్పుకొచ్చారు. స్వాతంత్ర వీరుల కలలకు ఈ భవనం నిదర్శనం గా నిలుస్తుందని ఆయన అన్నారు.
కొత్త లక్ష్యాలతో దేశం ముందుకు వెళ్తుందని, ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత వైపే ఆశగా చూస్తుందని ఆయన తన మొదటి స్పీచ్ లో చెప్పుకొచ్చారు.
దేశ అవసరాలు పెరుగుతున్నాయి, పాత పార్లమెంట్ భవనం లో కూర్చోవడానికి మాత్రమే సమస్య కాకుండా
అనేక సాంకేతిక ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు సాంప్రదాయానికి టెక్నాలజీని మేలవించి నిర్మించిన ఈ భవనం
దేశ భవిష్యత్తు అవసరాలను తీరుస్తుందని ,వచ్చే కొన్ని సంవత్సరాలలో ఎంపీల సంఖ్య పెరుగుతుందని ,
అయినా అప్పటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ భవనాన్ని నిర్మించామని ఆయన చెప్పుకొచ్చారు.
అమృత మహోత్సవంలో భారతీయులు తమ ప్రజాస్వామ్యానికి ఈ నూతన పార్లమెంటు భవనాన్ని
బహూకరించుకున్నారని తెలిపారు. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ సర్వమత ప్రార్ధనలు జరిగాయి.
సంప్రదాయం..ఆదునీత మేళవింపుతో కొత్త పార్లమెంట్ ను నిర్మాణం చేసినట్లు ప్రధాని వెల్లడించారు.
భారత దేశం అభివృద్ధి చెందడమంటే, ప్రపంచ అభివృద్ధికి దోహదపడటమని తెలిపారు.
కొత్త పార్లమెంటు భవనం ప్రజాస్వామ్య దేవాలయమని పేర్కొన్నారు. ప్రపంచమంతా Modi : భారత
దేశంవైపు ఆసక్తిగా చూస్తోందన్నారు. కొత్త పార్లమెంటు భవనం భారత దేశ గౌరవాన్ని మరింత పెంచిందని చెప్పారు.
నవ భారతం కొత్త పంథాలో దూసుకెళ్తుందన్నారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు కొత్త పార్లమెంట్ ద్వారా నెరవేరుతాయని ప్రధాని చెప్పుకొచ్చారు.
యావత్తు ప్రపంచం మొత్తం దేశం వైపు చూస్తోందన్నారు.
పెరగనున్న ఎంపీల సంఖ్యకు అనుగుణంగా ఆధునిక వసతులతో కొత్త భవనం నిర్మించామన్నారు.
21వ శతాబ్దంలో భారత్ ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుంది.
దేశం బానిస వాసనలను వదిలిపెట్టి ముందుకెళ్తోంది. పార్లమెంటు కొత్త భవనం ఈ ప్రయత్నానికి
సజీవ చిహ్నంగా మారిందన్నారు. గడిచిన 9 ఏళ్లుగా నవ నిర్మాణం, పేదల సంక్షేమం కోసం కృషి చేశామన్నారు.
ఆజాదీకా అమృతకాలం.. దేశానికి కొత్తModi : దిశను నిర్దేశించే కాలం గా పేర్కొన్నారు.
కొత్త భారతావనికి ఆజాదీకా అమృతకాలం మార్గం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.