Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగు మృతి
Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగు మృతి కర్ణాటక రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
కారు టైరు పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.
కర్ణాటకలోని కొప్పల జిల్లా జాతీయ రహదారి 50పై ఈ ప్రమాదం జరిగింది.
దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
విజయపురకు చెందిన కుటుంబసభ్యులు ఆరుగురు కారులో బెంగళూరు బయలుదేరారు.
వారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో ఉన్న రాచప్ప బనసోడె, రాఘవేంద్ర కాంబళె, అక్షయ శివశరణ, జయశ్రీ కాంబళె,
చిన్నారులు రాఖీ, రష్మిక అక్కడికక్కడే మృతిచెందారు.
పోలీసులు క్రేన్ సాయంతో కారును బయటకు లాగి మృతదేహాలను వెలికి తీశారు.
మరొక ఘటనలో అసోం రాష్ట్రంలోని గౌహతిలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి.
ఆదివారం అర్థరాత్రి గౌహతిలోని జలుక్బరి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని,
ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారని గౌహతిజాయింట్ పోలీస్ కమిషనర్ తుబే ప్రతీక్ విజయ్ కుమార్ చెప్పారు.
ప్రాథమిక Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగు మృతి విచారణ ప్రకారం మృతులు విద్యార్థులని ప్రతీక్ పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు.
అతి వేగంగా వచ్చిన కారు గూడ్స్ వాహనాన్ని ఢీకొందని పోలీసులు వివరించారు.
ఈ రోడ్డు ప్రమాద ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు.
విద్యార్థులు మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. జలుక్బరి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో
ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగు మృతి
విద్యార్థులు మృతి చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ట్వీట్ చేశారు.
వారి తల్లిదండ్రులకు, కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తామని చెప్పారు.
జీఎంసీహెచ్లో అధికారులతో మాట్లాడినట్లు సీఎం తెలిపారు.
మరొక ఘటన లో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు.
మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాలు.. విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, గుంటూరు వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగు మృతి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రమాద స్థలంలోనే మృతిచెందారు.
మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని వినుకొండ ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు.
దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరో ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది.
ఈ ప్రమాదంలో మృతిచెందినవారిని విజయవాడకు చెందిన సాయి, పిల్లి శ్రీనివాస్, చంద్రశేఖర్, కె శ్రీనులుగా గుర్తించారు.
వీరంతా అనంతపురంలో ఒక పెళ్లి మండపం డెకరేషన్ కోసం వెళ్లి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Assam | At least seven dead and several others injured in a road accident that took place in the Jalukbari area of Guwahati on Sunday late night.
"As per preliminary investigation, we have found that the deceased are students. The incident took place at Jalukbari area," says…
— ANI (@ANI) May 29, 2023