Karate Kalyani: మా సభ్యత్వం రద్దుపై స్పందించిన

Karate Kalyani

Karate Kalyani: మా సభ్యత్వం రద్దుపై స్పందించిన క‌రాటే క‌ళ్యాణి

Karate Kalyani: సినీ న‌టి కరాటే కళ్యాణిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ నుంచి స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

సీనియర్‌ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ మా అసోసియేషన్‌ ఈ నెల 16వ తేదీన షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

అయితే ఆ నోటీసులపై ఇప్పటివరకు కళ్యాణి స్పందించకపోవడంతో మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణిని సస్పెండ్ చేసినట్లు మా సభ్యులు తెలిపారు.

అయితే తాజాగా కరాటే కళ్యాణి దీని పై స్పందించారు.

ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడినందుకే  త‌న‌ను ‘మా’ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశార‌ని కరాటే కళ్యాణి అంది.

అయితే తాను వేసిన పిటిష‌న్‌కు ‘మా’ అసోసియేష‌న్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని తెలిపింది.

సస్పెండ్ చేయడం పట్ల న్యాయపోరాటం చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

తాను ఎన్టీఆర్‌కి వీరాభిమానిని అని అయితే శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహం పెట్టడాన్ని మాత్రం తాను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు మ‌రోసారి చెప్పింది.

దీని పై ఆమె స్పందిస్తూ’నేను చేసిన తప్పు ఏంటో నాకు అర్థం కావడం లేదు.

నేను మహానటుడు ఎన్టీఆర్‌కు వ్యతిరేకం కాదు. కృష్ణుడి రూపంలో ఆయన విగ్రహం పెడితే సమాజంలోకి తప్పుగా వెళ్తుంది.

ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహం పెడితే ఇక దేవుళ్ల విగ్రహలు ఎందుకు.?

మాకు ఆయన ఎంతో ఇష్టమైన దైవం అక్కడ ఏవైనా అసాంఘికKarate Kalyani:  కార్యకలాపాలు

జరిగితే దేవుడికి అప్రతిష్టే కదా. విగ్రహ ఏర్పాటును ఆపేయండి అని అడిగాను. మీరు అసోసియేషన్ నుంచి

ఇలా మాట్లాడకూడదు అని నాకు షోకాజ్ నోటీసు పంపారు’ అని కరాటే కళ్యాణి చెప్పారు.

అయితే వివరణ ఇవ్వడానికి  తనకు మూడు రోజులు గడువు ఇచ్చారు. కానీ నా ఆరోగ్యం బాలేదు.

గొంతుకూడా పోయింది. అందుకే నేను వివరణ ఇవ్వలేదు అని తెలిపారు. తనకు ఇంకా టైమ్ కావాలని ఒక నోటీసు రాసి పంపించా.

దాన్ని లీగల్ నోటీసుగా భావించి తనను సస్పెండ్ చేశారని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు.

ఈ నెల 23న జ‌రిగిన కార్య‌వ‌ర్గ సమావేశంలో ‘మా’ నిబంధ‌న‌ల మేర‌కు క‌రాటే

క‌ళ్యాణిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ‘మా’ అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీ రఘు బాబు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఖమ్మం పట్టణంలోని లకారం చెరువు మధ్యలో తానా సహకారంతో 54 అడుగుల ఎత్తైనఎన్టీఆర్‌ విగ్రహాన్ని

కృష్ణుడు రూపంలో ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే.

అయితే దీనిపై అభ్యంతరాలు రావడంతో కోర్టులో కూడా వాదనలు బాగా జరుగుతున్నాయి.

అయితేఎన్టీఆర్‌ విగ్రహం ఇక్కడ కృష్ణుడి రూపంలో ఉండడమే అభ్యంతరాలను Karate Kalyani:  వ్యక్తం

చేసేలా చేస్తోంది.  కరాటే కళ్యాణి తమ యాదవ కులానికి కలంకం కలుగుతుంది

అంటూ విమర్శలు చేస్తూ కోర్టుకెక్కగా కోర్టు ఆమెకు మద్దతుగా నిలిచినా ప్రజలు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh