Jagan : ఏపీ సీఎం జగన్‌తో జర్మనీ కాన్సుల్ జనరల్ కుచ్లర్ భేటీ
Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో భారత్‌లో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ భేటీ అయ్యారు.
ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు,
అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విది విధానాలను సీఎం వివరించారు
. ఆంధ్రప్రదేశ్‌లో సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
జర్మన్ సహకారంతో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులను వివరించారు. ఆంధ్రప్రదేశ్, జర్మనీల మధ్య
ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించేందుకు, సాంస్కృతిక మార్పిడి మరియు పర్యాటక రంగాన్ని
ప్రమోట్ చేసేందుకు తమవంతు కృషిచేస్తామని ఆమె అన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయదలచిన 10 వేల మెగావాట్‌ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ద్వారా సాంప్రదాయేతర
ఇంధన Jagan : వనరుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం మహిళా
సాధికారితలకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను సీఎం జర్మన్ కాన్సుల్ జనరల్‌కు వివరించారు.
అయితే, మ్యాన్‌ఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, రెన్యూవబుల్ ఎనర్జీ
వంటి వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్‌రెడ్డికి జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ వివరించారు. ఏపీని ఫోకస్డ్ స్టేట్‌గా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.
చెన్నెలోని కౌన్సులేట్ జనరల్ ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీకి చెందిన కౌన్సల్ జనరల్
కేరిన్ స్టోల్ సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రాథమిక రంగంలో జర్మనీ దేశం తరుపున వివిధ కంపెనీలు పెట్టుబడులు
పెట్టే అంశంపై ఆమె సీఎస్‌తో చర్చించారు. అదే విధంగా విద్యా, సాంస్కృతిక మరియు పర్యాటక రంగాలతోపాటు
ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న Jagan : జర్మనీ కంపెనీలకు సంబంధించిన వివిధ ద్వైపాక్షిక సహకార
అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ.
.. రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాల్లో మెరుగైన మౌళిక సదుపాయల కల్పనకు ముఖ్యమంత్రి అత్యంత
ప్రాధాన్యతనిస్తున్నారని ఆమె జర్మన్ కౌన్సల్ జనరల్ కేరిన్ స్టోల్ దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో
హైదరాబాద్‌లోని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ హానరరీ కౌన్సల్ బివిఆర్ మోహన్ రెడ్డి, రాష్ట్ర
ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారిని కలిసిన భారత్‌లో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్@GermanyinIndia#CMYSJagan #AndhraPradesh pic.twitter.com/Fz0VRGSYsa
— The Jagannaut (@TheJagannaut) May 24, 2023