TS EAMCET: తెలంగాణ ఎంసెట్

TS EAMCET:

TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో సత్తా చాటిన అమ్మాయిలు

TS EAMCET: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన

ఎంసెట్ – 2023 ఫలితాలు నేడు విడుదల చేశారు. వీటిని మొదట ఉదయం 11 గంటలకు

విడుదల చేస్తామని ప్రకటించినా పలు కారణాల వల్ల కొంచెం ముందుగానే విడుదల

చేయాలని నిర్ణయించారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా

సమావేశం నిర్వహించి ఉదయం 9.30 గంటలకు  మాసబ్‌ట్యాంక్‌ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ

ఆడిటోరియంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణలో 15 జోన్లు, ఏపీలో 6

జోన్లలో పరీక్ష నిర్వహించారని మంత్రి తెలిపారు. అలాగే ఈ ఫలితాలను

https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అగ్రికల్చర్ స్ట్రీమ్ లో 1,10544 మంది పరీక్ష రాయగా, 91,935 మంది విద్యార్థులు (86 శాతం)

ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,53,890 మంది తెలంగాణ

విద్యార్థులు పరీక్ష రాశారని, ఏపీ నుంచి 51,461 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

మొత్తం పరీక్ష రాసిన వారిలో 1,56,879 మందిTS EAMCET: ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు.

ఎంసెట్‌లో పరీక్ష పాసైన వారికి మంత్రి అభినందనలు తెలిపారు.

ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం ఉత్తీర్ణులు కాగా, 82 శాతం మంది అమ్మాయిలు

పాసయ్యారని తెలిపారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 84 శాతం మంది అబ్బాయిలు పాస్ కాగా, అమ్మాయిలు

87 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు.

అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం  ఉత్తీర్ణుల శాతం పెరిగింది అని అన్నారు.

అలాగే టీఎస్ ఎంసెట్ 2023 పరీక్షలో అభ్యర్థుల స్కోరు ఆధారంగా మూడు రౌండ్లలో

కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. టీఎస్ ఎంసెట్ 2023 ర్యాంకు కార్డు, హాల్ టికెట్,

ఆధార్ కార్డు, ఇంటర్మీడియట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్ వంటి పలు సర్టిఫికెట్లు

కౌన్సెలింగ్ కోసం అవసరమవుతాయి. వీటిని విద్యార్థులు అందుబాటులో ఉంచుకోవాలి.

టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కటాఫ్ లను

టీఎస్ సీహెచ్ విడుదల చేస్తుంది. టీఎస్ ఎంసెట్ – 2023 పరీక్షలు మే 12 నుంచి 14 వరకు జరిగాయి.

అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలకు సంబంధించిన ఎంసెట్ ఆన్సర్ కీని మే 14న,

ఇంజినీరింగ్ పరీక్షకు మే 15న విడుదల చేశారు.

 అయితే ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి 

ఈ పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవడానికి విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్,

అర్హత పరీక్ష హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో సిద్ధంగా ఉండాలి.

టీఎస్ ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.ac.in లోకి వెళ్లాలి.

హోమ్ పేజీలో టీఎస్ ఎంసెట్ 2023 రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.

తదుపరి దశలో విద్యార్థులు లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

TS EAMCET: తర్వాత టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

దానిని ఒక సారి చెక్ చేసుకోని డౌన్ లోడ్ చేసుకోవాలి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh