యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 ఫైనల్ ఫలితాలు వెలువడ్డాయి. సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది.యూపీపఎస్సీ సివిల్స్ 2022 ఫలితాల్లో మహిళలు చరిత్ర సృష్టించారు. తొలి నాలుగు ర్యాంకులు మహిళలే సాధించడం ఈ యూపీపఎస్సీ సివిల్స్ 2022 ప్రత్యేకత. తొలి ర్యాంక్ ను ఇషిత కిషోర్ సాధించగా, రెండో ర్యాంక్ ను గరిమా లోహియా, మూడో ర్యాంక్ ను ఉమా హారతి, నాలుగో ర్యాంక్ ను స్మృతి మిశ్రా సాధించారు.
ఇక ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. జీవీఎస్ పవన్ దత్తా 22 ర్యాంకు సాధించగా.. శాఖమూరి శ్రీసాయి అర్షిత్ 40, ఆవుల సాయికృష్ణ 94, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంతకుమార్ 157, కమతం మహేశ్‌కుమార్ 200 ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 217, బల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్.చేతనారెడ్డి 346, శృతి యారగట్టి 362, యప్పలపల్లి సుషకమిత 384, సీహెచ్ శ్రావణ్‌కుమార్ రెడ్డి 426 ర్యాంకులతో సత్తా చాటారు.
మొత్తం 933 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. వీరిలో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99 మంది, ఓబీసీ నుంచి 263 మంది, ఎస్సీ నుంచి 154, ఎస్టీ నుంచి 72 మంది ఉన్నారు. . వీటిలో ఐఏఎస్ సర్వీసెస్‌కు 180 మంది, ఐఎఫ్ఎస్కు 38 మందిని, ఐపీఎస్‌కు 200 మందిని ఎంపిక చేశారు. అలాగే సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మందిని, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022గా ఉంది. అలాగే అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.in/ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) తోపాటు గ్రూప్ A, గ్రూప్ B కేటగిరీలకు చెందిన కేంద్ర సర్వీసులలో నియమకాల కోసం UPSC గత ఏడాది సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించింది. అయితే మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిని పర్సనాలిటీ టెస్టు కోసం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఇంటర్వ్యూ చేసింది.