CM : జగన్‌ చెప్పాడంటే ఖచ్చితంగా

cm:

CM : జగన్‌ చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడంతే: పేర్ని నాని

CM :  మచిలీపట్నం (బందరు) అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్‌ శ్రీకారం చుట్టారని ప్రశంసించారు మాజీ మంత్రి పేర్ని నాని.

బందరుకు సీఎం జగన్‌ పూర్వ వైభవం తీసుకొస్తున్నారని.. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారన్నారు.

మచిలీపట్నం మండలం తపసిపూడి సమీపంలో పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన సభలో నాని కీలక వ్యాఖ్యలు చేశారు. బందరు పోర్టు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారని.

నక్కజిత్తుల బాబు ఇంటికెళ్తేనే బందరు పోర్టుకు అనుమతులు వచ్చాయన్నారు.

అలాగే బందరు నియోజకవర్గంలో 25,090 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం.బందరు వాసుల కలను సీఎం జగన్‌ నెరవేర్చారు.

రూ. 197 ‍కోట్ల విలువైన భూములను పేదలకు పంపిణీ చేశారు. బందరు వాసుల కలను సీఎం జగన్‌ నెరవేర్చారు.

బందరుకు మెడికల్‌ కాలేజీ తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌ది. 64 ఎకరాల్లో రూ. 550 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మిస్తున్నారు.

ఏపీలో 31లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు.

బందరులో గోల్డ్‌ కవరింగ్‌ యూనిట్‌లను నిలబెట్టిన ఘనత సీఎం జగన్‌ది. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు

పేదలకు సెంటు భూమి ఇచ్చారా?’ అని ప్రశ్నించారు పేర్ని నాని.

అయితే మరోసారి జగన్‌తో వేదిక పంచుకునే అవకాశం దక్కుతుందో లేదో అంటూ పరోక్షంగా తన పొలిటికల్ CM :

రిటైర్మెంట్ గురించి ప్రస్తావించారు పేర్ని నాని. బందరు చరిత్రను తిరగరాసిన సీఎం జగన్‌కు దక్కుతుందని.

బందరుకు ఉత్వల భవిష్యత్‌ని తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.

బందరుకు ఏది కావాలంటే ప్రతి అడుగుకు శ్రీకారం చుడతానని హామీ ఇచ్చి నెరవేర్చారని  ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

‘నాకంటే వయసులో చిన్నవాడైన, మనందరి గుండెల్లో సుస్థిరమైన, బలమైన స్థానాన్ని సంపాదించుకున్న సీఎం జగన్‌.

నాకంటే వయసులో CM :  చిన్నవాడైపోయాడు కానీ లేదంటే ఇన్ని వేలమంది ముందు వందకు వంద శాతం.

నేను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తెస్తున్న జగన్‌కు పాదాభివందనం చేయాల్సిందే.

కానీ నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి చేతులెత్తి మొక్కుతున్నాను’ అంటూ సభలో ఎమోషనల్ అయ్యారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh