నేడు కీలకం కానున్న కోల్‌కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జెయింట్స్‌ మ్యాచ్

ఐపిఎల్  2023 సీజన్‌లో నేడు డబుల్‌ హెడ్డర్స్‌లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌ లక్నోకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు అవుతుంది. ఓడితే మాత్రం మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు అయినా లక్నోకు లాభం చేకూరనుంది. మరోవైపు కోల్‌కతా ఈ మ్యాచ్ గెలిచినా దాదాపుగా ప్లేఆఫ్స్‌ వెళ్లడం అసాధ్యం. అయితే మెరుగైన స్థానంతో టోర్నీని ముగించాలని కోల్‌కతా భావిస్తోంది.

ఐపీఎల్- 16 లో  భాగంగా ఇటీవలే ముంబై ఇండియన్స్‌తో  కీలక మ్యాచ్ గెలిచి   పాయింట్ల పట్టికలో  మూడో స్థానంలోకి వచ్చిన లక్నో.. 13 మ్యాచ్ లలో  ఏడు గెలిచి 15 పాయింట్లతో  మూడో స్థానంలో ఉంది.  అయితే ఆ  జట్టు ఈ మ్యాచ్ లో ఓడితే  ఫోర్త్ ప్లేస్‌లోకి పడిపోయే  ప్రమాదం ఉంది.   పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  14  పాయింట్లతో  ఉంది. బెంగళూరు చివరి మ్యాచ్ లో గుజరాత్ ను ఓడిస్తే  అప్పుడు ఆ జట్టు 16 పాయింట్లకు చేరి.. ముంబై (14 పాయింట్లు)  కూడా హైదరాబాద్ ను ఓడిస్తే ఆ జట్టుకు కూడా  16 పాయింట్లు వస్తే  అప్పుడు లక్నో ఐదో స్థానానికి పడిపోయే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో  ఈడెన్ గార్డెన్ లో  ఈ డ్రామా అంతటికీ ముగింపు పలికేందుకు  కృనాల్ పాండ్యా అండ్ గ్యాంగ్ సిద్ధమైంది.

శుక్రవారం రాత్రి కోల్‌కతాలో వర్షం పడటంతో మ్యాచ్‌ జరగడంపై కేకేఆర్ అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. సొంత మైదానంలో చివరి లీగ్‌ మ్యాచ్‌ను చూడాలనే ఆశ నెరవేరుతుందో లేదోనని ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే వర్షం మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉంకలిగించదని కోల్‌కతా వాతావరణ శాఖ చెప్పింది. మ్యాచ్ సమయానికి వాన పడే అవకాశాలు చాలా చాలా తక్కువ అని తెలిపింది. ఒకవేళ ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయితే లక్నో ఖాతాలో ఒక పాయింట్ చేరుతుంది. ఇదే జరిగితే 16 పాయింట్స్, మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, జయదేవ్ ఉనద్కత్, కరుణ్ నాయర్, రొమారియో షెపర్డ్, నవీన్-ఉల్-హక్, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, యుధ్వీర్ సింగ్ చరక్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, మన్‌దీప్ సింగ్, లిటన్ దాస్, కుల్వంత్ ఖేజ్రోలియా, డేవిడ్ వైస్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, ఎన్ జగదీశన్

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh