Janasena MLA son Marriage: రాపాక వరప్రసాద్ కుమారుడి పెళ్లి…. శుభలేఖపై జగన్ భారతి ఫోటోలు
Janasena MLA son Marriage: రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్ కుమారుడి పెళ్లి త్వరలో జరగనుంది. రాపాక తన కుమారుడి వివాహానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
రాపాక వరప్రసాదరావు, నాగరత్నం దంపతుల కుమారుడి వివాహం జూన్ 7వ తేదీ రాత్రి ఒంటిగంట రెండు నిమిషాలకు జరగనుంది.
ఈ క్రమంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడి పెళ్లి పత్రిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అందుకు కారణం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడి పెళ్లి పత్రిక పై మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరియు భారతమ్మ గార్ల ఆశీస్సులతో అంటూ
వారిద్దరి ఫోటోను పెళ్లి పత్రిక పై వేసి ఆహ్వానించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Watch
ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతుంది. ఎందుకంటే రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఎందుకంటే.. రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీలో టిక్కెట్ ఇవ్వలేదని చివరి రోజుల్లో ఆయన జనసేనలో చేరితే వెంటనే బీఫాం ఇచ్చారు పవన్ కల్యాణ్.
జనసేన కోసం కొంత మంది పార్టీ నేతలు కష్టపడినప్పటికీ రాపాక మాజీ ఎమ్మెల్యే కావడంతో టిక్కెట్ ఇచ్చారు. అదృష్టం బాగుండి రాపాక చాలా స్వల్ప తేడాతో విజయం సాధించారు.
కొద్ది రోజులకే ఆయన పవన్ కల్యాణ్ ను విమర్శించి పార్టీకి దూరయ్యారు.
అయితే ఇప్పటికే పలుమార్లు బయట అసెంబీలో జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ రాపాక మాట్లాడి తన వీర విధేయతను నిరూపించుకున్నారు.
ఇప్పుడు ఏకంగా తన కుమారుడి పెళ్లి ఆహ్వానపత్రికపై సీఎం దంపతుల ఫొటోలు ముద్రించి తాను జగన్ కు వీరభక్తుడినని మరోసారి చాటిచెప్పారు.
అయితే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈ పెళ్లి పత్రిక చూసి సంతోషం వ్యక్తం చేస్తుంటే మరో ప్రక్క జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం రాపాక వరప్రసాద్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలను మించి రాపాక వర ప్రసాద్ జగన్ భజన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ రాజోలు నియోజకవర్గం నుండి వైసిపి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తున్నట్టు సమాచారం.
అసలు వైసీపీ కోసం ఐదేళ్లు పని చేసినా జగన్ మోసం చేస్తే పవన్ టిక్కెట్ ఇచ్చారని ఇప్పుడు ఆయననే మోసం చేశారని జనసైనికులు విమర్శిస్తున్నారు.
One thought on “Janasena MLA son Marriage: రాపాక వరప్రసాద్ కుమారుడి పెళ్లి….”