Love: ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి..

Love

Love: ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి.. యువకుడు బలి

Love: ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయం కావడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

అయితే ఎస్‌ఐ సుమన్‌ తెలిపిన వివరాలు  ప్రకారం పట్టణంలోని కొత్వాల్‌గూడకు చెందిన సిద్దాంతి చంద్రయ్య కుమారుడు సిద్దాంతి శివ (23) ఆటో డ్రైవర్‌. అదే బస్తీకి చెందిన యువతిని ప్రేమించాడు.

ఇటీవల యువతికి వారి కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయం చేయడంతో పాటు తాంబులాలు మార్చుకున్నారు.

ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు మూడురోజుల కిందట శివ ఫోన్‌ను తీసుకుని అందులో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను డిలీట్‌ చేయడంతో పాటు అమ్మాయి జోలికి రావొద్దని హెచ్చరించారు.

దీనితో శివ మనస్తాపం చెందిన శివ మంగళవారం రాత్రి చెన్నమ్మ హోటల్‌ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు.

కుటుంబానికి అండగా ఉన్న కుమారుడు చనిపోయాడని బోరున విలపించారు.  డెడ్​బాడీ ని పోస్టుమార్టం నిమిత్తం  ఉస్మానియా మార్చురీకి తరలించారు.

పోస్టుమార్టం అయిన తరువాత   గ్రామస్తులు అతడి డెడ్​బాడీతో అమ్మాయి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. శివ మృతికి యువతి కుటుంబసభ్యులే కారణమంటూ అతడి తండ్రి చంద్రయ్య ఆరోపించాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఎయిర్​పోర్టు పోలీసులు మృతుడి బంధువులతో మాట్లాడి వారిని అక్కడి నుంచి పంపించారు. చంద్రయ్య కంప్లయింట్​ మేరకు కేసు ఫైల్ చేసి  దర్యాప్తు చేపట్టారు.

కాగా శివ ఆత్మహత్య ఘటన కొత్వాల్‌గూడలో ఉద్రిక్తతకు దారితీసింది. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, బస్తీవాసులు సిద్దాంతి శివ మృతదేహాన్ని యువతి ఇంటి ముందు పెట్టి బైఠాయించారు.

అక్కడే గోతి తవ్వి పూడ్చివేస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. యువతి కుటుంబ సభ్యులే శివ మృతికి కారణమని నినాదాలు చేశారు. దీంతో భారీ సంఖ్యలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh